Homeటాప్ స్టోరీస్తెనాలి రామకృష్ణ మూవీ రివ్యూ

తెనాలి రామకృష్ణ మూవీ రివ్యూ

తెనాలి రామకృష్ణ మూవీ రివ్యూ
తెనాలి రామకృష్ణ మూవీ రివ్యూ

నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, ప్రభాస్ శీను, రఘు బాబు తదితరులు
దర్శకత్వం: జి నాగేశ్వర రెడ్డి
నిర్మాత: అగ్రహారం నాగి రెడ్డి
సంగీతం: సాయి కార్తీక్
విడుదల తేదీ: నవంబర్ 15, 2019
రేటింగ్: 2/5

అసలు హిట్టు అన్న పదమే మరిచిపోయినట్టుగా వరస ప్లాపులు కొట్టిన సందీప్ కిషన్, రీసెంట్ గా నిను వీడను నీడను నేనే చిత్రంతో కొంత ఊరట పొందాడు. ఇక ఇప్పుడు తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ సినిమాతో మాస్ కామెడీ చేయడానికి సిద్ధమైపోయాడు. మరి సందీప్ కిషన్ కొట్టుకుంటున్న భారీ హిట్ ఈ సినిమాతో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా?

- Advertisement -

కథ:

తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఒక ఛోటా లాయర్. ఏవో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. ఏదైనా కేసు పట్టాలని చెప్పి ఆఫర్లు కూడా ప్రకటిస్తాడు. అయినా ప్రయోజనం ఉండదు. తన లైఫ్ ను మార్చేసే కేసు రావాలని ఎదురుచూస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మర్డర్ మిస్టరీ కేసులో వరలక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) కేసు వాదించాల్సి వస్తుంది. మరి అప్పుడు తెనాలి ఏం చేస్తాడు? ఈ కేసు వల్ల తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది. మధ్యలో రుక్మిణి (హన్సిక)తో లవ్ ట్రాక్ కూడా నడుపుతుంటాడు మనోడు. ఇంతకీ రుక్మిణికి మెయిన్ కథకు సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సినిమా చూసి సమాధానాలు తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

సందీప్ కిషన్ మంచి నటుడన్న విషయం అందరికీ తెల్సిందే. అయితే ఈ చిత్రంతో తన నటనను కామెంట్ చేయలేము. అలా అని బాగా చేయలేదని కాదు. ఎప్పట్లానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ చిత్రంలో కామెడీ, డ్యాన్స్, ఎమోషన్ ఇలా అన్నీ ఉన్నాయి. తనదైన ఎనర్జీతో నటించేసాడు. హన్సిక గురించి చెప్పుకోవడానికేం లేదు. అసలు ఆమె పాత్ర ఏమాత్రం బాగోనప్పుడు ఇక పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకునేది ఏముంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఏదైనా పాత్రకు బలం తేగలదు. ఆ ఇంటెన్సిటీ ఆమెలో ఉంది. కానీ ఎందుకని అన్నీ ఒకలాంటి పాత్రలేఎంచుకుంటోందో అర్ధం కాదు. రఘుబాబుకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. మురళి శర్మ విసిగిస్తాడు. వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రభాస్ శీను లాంటి వాళ్ళు కామెడీ చేయడానికి కష్టపడ్డారు. మిగతా వారంతా మాములే.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో సాంకేతిక నిపుణుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ఎడిటింగ్ చాలా బ్యాడ్. చాలా సన్నివేశాలు సడెన్ గా ఎండ్ అయిపోయిన భావన కలుగుతుంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ బాలేదు. సంగీతంలో కొత్తదనమేం లేదు. సాయి కార్తీక్ తన పాత పాటలనే అటు తిప్పి ఇటు తిప్పి కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్లుగా ఉంది. తెనాలి రామకృష్ణ రైటింగ్ దగ్గరే ఫెయిల్ అయింది. కామెడీ అంటే కేవలం బూతే అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. డబల్ మీనింగ్ జోకులు ఈ సినిమాలో కోకొల్లలు. కొన్ని విసుగు తెప్పిస్తాయి. నిజజీవితంలో జరిగిన కోడి కత్తి వంటి సంఘటనలపై జోకులు బానే పేలాయి. జి నాగేశ్వర రెడ్డి దర్శకుడిగా సినిమాకు న్యాయం చేయలేకపోయాడు. సినిమాలో ఎక్కడా కన్సిస్టెన్సీ ఉండదు.

చివరిగా:

జి నాగేశ్వర రెడ్డి అసలు ఫామ్ లో లేడు. తన రీసెంట్ హిట్ ఏంటనేది గుర్తు తెచ్చుకోవడం కూడా కష్టమే. తన పాత సినిమాలు గుర్తు తెచ్చుకున్నా అందులో డబల్ మీనింగ్ తోనే సినిమాను ముందుకు నడిపాడు. అప్పట్లో ఆ జోకులు చెల్లిపోయాయి. కామెడీ పండించడం చాలా కష్టమైపోతున్న ఈ రోజుల్లో కూడా అప్పటి కామెడీనే పండించాలని చూసాడు జి నాగేశ్వర రెడ్డి. ఒక డీసెంట్ సినిమా కాగల తెనాలి రామకృష్ణను రైటింగ్ దగ్గరే చంపేశాడు. ఓవర్ ది టాప్ కామెడీతో జనాలకు చిరాకు తెప్పించాడు. హన్సిక పాత్రను తీర్చిదిద్దిన విధానంతో జి నాగేశ్వర రెడ్డి ఫామ్ గురించి తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సన్నివేశాలున్నా కొంత పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ టైమ్ కు సినిమా మీద ఆసక్తి కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా కోర్ట్ రూమ్ సన్నివేశంతో మొత్తానికి సినిమా గాడిలో పడిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఒకసారి ఆ సన్నివేశం ముగిసాక సినిమా అటు పోతుందో కూడా అర్ధం కాక ప్రేక్షకుడు అయోమయానికి గురవుతాడు. మొత్తంగా తెనాలి రామకృష్ణ నవ్వించడానికి వచ్చి నవ్వుల పాలైంది.

హిట్టు కొట్టాలన్న కోరిక ఉంటే సరిపోదు, కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి సందీప్ కిషన్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All