Homeఎక్స్ క్లూసివ్టెంపర్ రీమేక్ 100 కోట్ల క్లబ్ లో

టెంపర్ రీమేక్ 100 కోట్ల క్లబ్ లో

Temper Hindi remake Simmba 4 days collections
Ranveer Singh

ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం 2015 లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని తాజాగా బాలీవుడ్ లో సింబా పేరుతో రీమేక్ చేసారు . రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు . ఇక ఈ నెల 28న విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది . కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది సింబా చిత్రం . అవినీతి పరుడైన ఓ పోలీసు అధికారిగా రణ్ వీర్ సింగ్ నటన ఎన్టీఆర్ స్థాయిలో లేదు కానీ రణ్ వీర్ సింగ్ కూడా అద్భుతంగా నటించాడు .

మొదటి రోజున 20 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన సింబా ఆ తర్వాత అదే జోరు చూపించింది . ఇక బాక్సాఫీస్ వద్ద సరైన సినిమాలేవీ లేకపోవడంతో సింబా కు కలిసి రానుంది . కొత్త సంవత్సర వేడుకలు కూడా ఈ సినిమాకు బాగానే కలిసి రానున్నాయి . మొత్తానికి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా అవలీలగా 200 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తోంది .

- Advertisement -

English Title: Temper Hindi remake Simmba 4 days collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All