Homeటాప్ స్టోరీస్సినీ పాత్రికేయుల‌కు అండ‌గా తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌

సినీ పాత్రికేయుల‌కు అండ‌గా తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌

సినీ పాత్రికేయుల‌కు అండ‌గా తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌
సినీ పాత్రికేయుల‌కు అండ‌గా తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. దీని ప్ర‌భావానికి చాలా వ్య‌వ‌స్థ‌లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నాయి. ఈ క్రైసిస్ కార‌ణంగా సామాన్యుల జీవితాలు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయాయి.  లాక్ డౌన్‌కార‌ణంగా వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స్థంభించిపోయాయి. ప్ర‌పంచాన్ని అల్లల్లాడిస్తున్న క‌రోనా బారి నుంచి సామ‌న్యుల‌కు అండ‌గా నిల‌వ‌డం కోసం ప‌లు సంస్థ‌లు ముందుకొస్తున్నాయి.

సినీ కార్మికుల కోసం సినీ పెద్ద‌లంతా క‌లిసి  24 క్రాఫ్ట్‌ల కోసం సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటీ)ని ప్రారంభించారు. దీనిపై స‌ర్వ‌త్రా హర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఇదిలా వుంటే సెల‌వు అన్న‌దే లేకుండా 24 / 7 నిరంత‌రం సినీ వార్త‌ల్ని అందించే సినీ జ‌ర్న‌లిస్ట్‌ల కోసం తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అండ‌గా వుంటుంద‌ని భ‌రోసానిచ్చారు.

- Advertisement -

అధ్య‌క్షుడు ల‌క్షీనారాయ‌ణ మాట్లాడుతూ `ఫీల్డ్‌లో డైలీ ప్రెస్ మీట్‌ల‌కు హాజ‌ర‌య్యే ప్ర‌తీ ఒక్క జ‌ర్న‌లిస్ట్‌కి,  వీడియో జ‌ర్న‌లిస్ట్‌కి, ఫొటో జ‌ర్న‌లిస్ట్‌కి అండ‌గా వుంటాం. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనే భాగంలో 35 మంది తెలుగు సినీ పాత్రికేయుల‌కు నెల రోజుల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర స‌రుకుల‌ని అందించి అండ‌గా నిలిచాం.  ఇలానే అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఈ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల‌ని కోరుకుంటున్నాను.  ఏ ఒక్క‌రూ ఆక‌లితో వుండ‌కూడ‌ద‌ని మ‌న అసోసియేష‌న్ ముఖ్య ఉద్దేశ్యం. సినీ పాత్రికేయుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌లిగినా నాకు కానీ, నాయుడు సురేంద్ర‌కుమార్ గారికి, రాంబాబు (టివి 5) గారికి గానీ ఫోన్ చేసి  తెలియ‌జేయ‌వ‌చ్చు` అన్నారు.

మీ అంద‌రికి చివ‌ర‌గా నా ప్ర‌త్యేక విన్న‌పం. ఇది చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితి.  దీన్ని అంద‌రూ అర్థం చేసుకోవాలి. ఏ ఒక్క‌రికి స‌మ‌స్య వ‌చ్చినా అంద‌రం అండ‌గా వుండి పోరాడాలి.  అన్ని స‌మ‌స్య‌లు పోయి మ‌ళ్లీ అంద‌రం ఆనందంగా మ‌న ప‌నులు చేసుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడిని  తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ ద్వారా కోరుకుంటున్నాను `అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All