
ప్రభాస్ అభిమానులకు తీపి కబురు తెలిపింది తెలంగాణ సర్కార్. ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్ రేపు భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం తో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎలాగైనా మొదటిరోజు సినిమా చూడాలని అభిమానులు , ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ రెండు వారాలపాటు రాధే శ్యామ్ కు ఐదో షో కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మార్చి 11 నుంచి మార్చి 25వ తేదీ వరకూ ఐదో షో ప్రదర్శించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఉదయం పది గంటల నుండి తెల్లవారు జాము ఒంటి గంట వరకు షోస్ కు అనుమతి ఇచ్చారు. రాధాకృష్ణ డైరెక్షన్లో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.