Homeటాప్ స్టోరీస్డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు

డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు

Telangana elections on December 7thడిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ని ఖరారు చేసింది. డిసెంబర్ 7న పోలింగ్ కాగా డిసెంబర్ 11న కౌంటింగ్ ఉంటుందని అలాగే డిసెంబర్ 15 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ తెలిపారు.కేసీఆర్ గత నెలలో తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్ లో జరిగే మిగతా రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి.

నవంబర్ లో ఎన్నికలు వస్తాయి , దాదాపుగా నవంబర్ లొనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ఇంతకుముందు తెలిపిన విషయం తెలిసిందే. కాగా కొద్దిరోజులు ఆలస్యంగా డిసెంబర్ లో ఎన్నికలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ కు నవంబర్ కాకుండా డిసెంబర్ రావడంతో గెలుపు సాధ్యం అవుతుందా ? చూడాలి . ఎందుకంటే కేసీఆర్ కు ముహుర్తాల మీద బాగా నమ్మకం , కానీ అతడు కోరుకున్నట్లుగా రాలేదు మరి ఇలాంటి సమయంలో మహాకూటమి నుండి ఎలాంటి పోటీ ఎదురౌతుందో ? ఎన్నికల పోలింగ్ తేదీ ప్రకటించినప్పటికీ షెడ్యూల్ మాత్రం ఈనెల 12న ప్రకటించనున్నారు. మొత్తానికి తెలంగాణ లో ఎన్నికల వేడి మరింతగా రాజుకున్నట్లే పోలింగ్ తేదీ ప్రకటనతో.

- Advertisement -

English Title: Telangana elections on December 7th

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All