Homeటాప్ స్టోరీస్రెండో సినిమాతో ప్లాప్ అందుకున్న తేజ సజ్జ

రెండో సినిమాతో ప్లాప్ అందుకున్న తేజ సజ్జ

రెండో సినిమాతో ప్లాప్ అందుకున్న తేజ సజ్జ
రెండో సినిమాతో ప్లాప్ అందుకున్న తేజ సజ్జ

బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జ ఓహ్ బేబీ చిత్రంలో టీనేజ్ మనవడిగా నటించాడు. తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. హీరోగా చేసిన మొదటి సినిమా జాంబీ రెడ్డి డీసెంట్ సక్సెస్ ను సాధించింది. ఇక గత వారాంతం తన రెండో చిత్రాన్ని విడుదల చేసాడు. ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ చిత్రం జులై 30న విడుదలైంది.

అయితే మొదటి రోజు డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు నుండి ప్లాప్ అయిపోయింది. హైదరాబాద్, వైజాగ్ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇష్క్ చిత్ర కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఇక ఈరోజు నుండి వర్కింగ్ డేస్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత దిగజారే అవకాశముంది.

- Advertisement -

మొత్తానికి తేజ తన రెండో సినిమాతో ప్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. తేజ సజ్జ ఇప్పటికే తన మూడో సినిమా హనుమాన్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. జాంబీ రెడ్డిను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కూడా డైరెక్టర్ అన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All