Homeటాప్ స్టోరీస్హరిహర వీరమల్లు సెట్ లో శ్రీరామనవమి వేడుకలు

హరిహర వీరమల్లు సెట్ లో శ్రీరామనవమి వేడుకలు

Team  Hari Hara Veera Mallu conducted pooja on the auspicious occasion of Sri Rama Navami
Team Hari Hara Veera Mallu conducted pooja on the auspicious occasion of Sri Rama Navami

వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ తో వరుస బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టుకున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 60 శాతం వరకు పూర్తికాగా..మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలనీ పవన్ ఫిక్స్ అయ్యాడు. రెండు రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ మొదలు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. కాగా ఈరోజు శ్రీరామనవమి సందర్భాంగా సెట్ లో సీతారాముల ఫోటోలకు ప్రత్యేక పూజలు చేసారు.

హరిహర వీరమల్లు సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని ఇంతకుముందు అనుకున్న విషయం తెలిసిందే. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మళ్ళీ ప్లాన్ మొత్తం మారిపోయింది. దీంతో సినిమాను ఈ ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారు. కుదిరితే దసరా టైమ్ లోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All