Homeఎక్స్ క్లూసివ్వర్మపై కేసు నమోదు

వర్మపై కేసు నమోదు

TDP MLA SV Mohan reddy Case files on ramgopal varma వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ పై కేసు నమోదు అయ్యింది . వెన్నుపోటు సాంగ్ చంద్రబాబు కీర్తి ప్రతిష్టలను నాశనం చేసేది గా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు తెలుగుదేశం శ్రేణులు అంతేకాదు వర్మ దిష్టి బొమ్మ లను సైతం తగుల బెట్టారు . అయితే మీరు ఎంతగా నన్ను తిడితే నాకు అంత మంచిది ,నా సినిమాకు మరింత ప్రచారం కల్పించినవాళ్లు అవుతారు అంటూ విషపు నవ్వు నవ్వుతున్నాడు వర్మ .

ఇక కర్నూల్ ఎం ఎల్ ఏ ఎస్వీ మోహన్ రెడ్డి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసాడు వర్మపై . పోలీసులు కేసు నమోదు చేయడంతో నేను కూడా కర్నూల్ వెళ్లి ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు వర్మ . మరి ఈ రోజు వెళ్తాడా ? రేపా అన్నది తేలాల్సి ఉంది . ఎన్టీఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రన్ని వర్మ రూపొందిస్తున్న విషయం తెలిసిందే . 1995 లో ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించేశారు . దాంతో కొంతకాలానికే ఎన్టీఆర్ మరణించాడు . దాంతో ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు తో పాటుగా అతడికి సహకరించిన వాళ్ళు కూడా ఉన్నారని వర్మ ఆరోపిస్తున్నాడు . ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి .

- Advertisement -

English Title: TDP MLA SV Mohan reddy Case files on ramgopal varma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All