Homeటాప్ స్టోరీస్టాక్సీ వాలా 7 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

టాక్సీ వాలా 7 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Taxiwala 1st Week Worldwide Collectionsవిజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లకు పైగా షేర్ సాధించి 11 కోట్ల లాభాలను తెచ్చింది . అంటే నిర్మాతకు మాత్రమే సుమా ! కేవలం అయిదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పది కోట్లకు బయ్యర్లకు అమ్ముకున్నారు . కాగా మొదటి వారంలోనే 16. 65 కోట్ల షేర్ ని వసూల్ చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . టాక్సీ వాలా రిలీజ్ అయితే చాలు హిట్ సంగతి తర్వాత అని అనుకున్నాడు విజయ్ కానీ అనూహ్యంగా పెద్ద విజయమే సాధించింది టేక్సీ వాలా . నవంబర్ 17 న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలో 16 కోట్లకు పైగా షేర్ సాధించడంతో నిర్మాతతో పాటుగా బయ్యర్లు కూడా లాభాలు పొందుతున్నారు . విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ నటించగా కీలక పాత్రలో మలయాళ భామ మాళవిక నాయర్ నటించింది .

ఏరియాల వారీగా టాక్సీ వాలా వసూళ్లు ఇలా ఉన్నాయి .
తెలంగాణ – 6. 05 కోట్ల షేర్
సీడెడ్ – 1. 35 కోట్ల షేర్
ఉత్తరాంధ్ర – 1. 46 కోట్లు
ఈస్ట్ – 75 లక్షలు
వెస్ట్ – 65 లక్షలు
గుంటూరు – 90 లక్షలు
కృష్ణా – 88 లక్షలు
నెల్లూరు – 31 లక్షలు
ఓవర్ సీస్ – 2. 40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 90 కోట్లు
మొత్తం షేర్ – 16. 65 కోట్లు

- Advertisement -

English Title: Taxiwala 1st Week Worldwide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All