Homeటాప్ స్టోరీస్"టాక్సీవాల" సక్సెస్ కి తెలుగు ప్రేక్షకుల ధన్యవాదాలు- నిర్మాత SKN

“టాక్సీవాల” సక్సెస్ కి తెలుగు ప్రేక్షకుల ధన్యవాదాలు- నిర్మాత SKN

taxiwaala movie success meetవిజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా‘. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన‌ చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ అంతా విజ‌య‌యాత్ర నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో జ‌రిగిన విజ‌య‌యాత్ర‌లో …

హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ మాట్లాడుతూ…ఒక కొత్త క‌థ‌, ఒక కొత్త డైరెక్ట‌ర్, ఒక కొత్త ప్రొడ్యూస‌ర్ రెండు పెద్ద బ్యాన‌ర్లు కాని మొత్తం కొత్త కాస్ట్ అండ్ క్రూ ఒక సంవ‌త్స‌రం పాటు సినిమా తీశాము.జులైలో ఫ‌స్ట్ ట్రైల‌ర్ రిలీజ్ అయి ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందో తెలియ‌ని సినిమా, గీతాఆర్ట్స్ ముందుకు వ‌చ్చి న‌డిపించిన సినిమా, ఆగ‌స్ట్‌లో రా ఫుటేజ్ లీక్ అయిన సినిమా. రిలీజ్‌కి మూడు నెల‌ల ముందు పూర్తిగా లీక్ అయిన సినిమా. ఈ సినిమా గురించి ఎన్ని నెగిటివ్ మాట‌లు వినాలో అన్నీ విన్నాను. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 18న ఈ చిత్రం విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయింది. ఈ సినిమాకి ఎంజాయ్ చేసినంత ఏ సినిమాకి ఎంజాయ్ చెయ్య‌లేదు. అస‌లు పూర్తిన స‌చ్చిన సినిమాతోని డాన్స్ ఆడించాము థియేట‌ర్ల‌లో. ఎస్‌కెఎన్ ఈ సినిమా గురించి ఎంత విన్నా కూడా అలాగే స్ర్టాంగ్‌గా నిల‌బ‌డ్డాడు. రెండు పెద్ద బ్యానర్లు కూడా బాగా స‌పోర్ట్ చేశాయి. రాహుల్ కూడా చాలా టెన్ష‌న్ ప‌డ్డాడు. ముందుగా మా టీమ్ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.బ‌న్నీఅన్న‌, ప్ర‌భాస్ అన్న‌,చ‌ర‌ణ్ అన్న‌, వ‌రుణ్ అన్న‌, ర‌ష్మిక‌మంద‌న్న‌, రాశిఖ‌న్నా, దుల్క‌ర్ స‌ల్మాన్‌, ఇలా ఎంతో మంది ట్వీట్ చేసి మా చిత్రాన్ని స‌పోర్ట్ చేశారు. మీరంద‌రూ ఇచ్చిన ఆద‌ర‌ణ వ‌ల్లే సినిమా, సినిమాలోని టెక్నీషియ‌న్లు ఇంత దూరం రాగ‌లిగారు. మీరంద‌రూ థీయేట‌ర్లు నింప‌డం వ‌ల్లే అని అన్నారు. మా అమ్మ‌గారి త‌రుపున కూడా మీ అంద‌రికి ఈ సినిమాని ఇంత స‌క్సెస్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

- Advertisement -

ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ… ఈ రోజు ఉద‌యం ఎనిమిది గంట‌ల‌కి మా టీమ్ అంద‌రం క‌లిసి హైద‌రాబాద్‌నుంచి బ‌య‌లుదేరాము వ‌చ్చేస‌రికి సాయంత్రం ఆరు అయింది. నేను అనుకున్నా ఎందుకింత దూరం పెట్టారు అని. కాని ఎప్పుడైతే ఈ గేట్‌లోకి ఎంట‌ర‌య్యామో వైబ్రేష‌న్స్ వ‌చ్చాయి. మీ ఎన‌ర్జీకి బిల్డింగ్ మొత్తం క‌దిలిపోతుంది. టాక్సీవాలా రైడ్ గురించి చెప్పాలంటే 2016 నుంచి మొద‌ల‌యింది. నేను నా రైట‌ర్ క‌లిసి రాసుకున్నాం. చాలా మంది హీరోల‌కి చెప్పాం. కొంత‌మంది క‌థ వింటూ నిద్ర‌పోయారు. కాని క‌థ అటూ ఇటూ తిరిగి ఫైన‌ల్‌గా జిఎటుపిక్చ‌ర్స్‌, యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద బ్యాన‌ర్‌లో రావ‌డం విజ‌య‌దేవ‌ర‌కొండ లాంటి మంచి హీరో దొర‌క‌డం మా అదృష్టం. మేము ఈ రోజు ఇంత స‌క్సెస్‌గా మీ ముందు వున్నానంటే ప్రొడ్యూస‌ర్స్‌, హీరోలు సినిమాలు ఇస్తారు కాని స‌క్సెస్ మాత్రం మీరు ఇచ్చిందే. పైర‌సీ అయి సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చినా కూడా థియేట‌ర్ల‌లో చూసి మీరు ఇంత బ్లాక్ బ‌స్ట‌ర్ చేశారంటే గ్రేట్‌. విజ‌య్ మీరు చాలా మంది యూత్‌కి ఇన‌స్పిరేష‌న్‌, మ‌న సినిమా టీమ్ అంద‌రికీ కూడా అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ఎస్‌కెఎన్ మాట్లాడుతూ…మాది ఈ జిల్లానే నాది ఏలూరు. రెండేళ్ళ‌నుంచి మేం ప‌డ్డ క‌ష్టానికి మీ ఎన‌ర్జీతో క‌ష్టం తెలియ‌డం లేదు.ఈ సినిమా మూడు నెల‌ల ముందే పైర‌సీ అయింది.అప్ప‌టి నుంచి నేను, మా డైరెక్ట‌ర్ చాలా టెన్ష‌న్ ప‌డ్డాం. అంద‌రూ సెల్‌ఫోన్ల‌లో చూస్తే సినిమాని థియేట‌ర్ల‌లో ఎవ‌రు చూస్తారు అని టెన్ష‌న్ ప‌డ్డాను. కాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా హీరో రౌడీ స్టార్ అడిగారు ఈ సినిమాని థియేట‌ర్ల‌లో చూడ‌మ‌ని అంతే అంద‌రూ థియేట‌ర్లు నింపేశారు.ఈ సినిమాకి టెక్నీషియ‌న్లు అంద‌రూ చాలా బాగా ప‌ని చేశారు. సాంగ్స్‌, డిఒపి, స్టోరీ అన్నీ చాలా బావున్నాయి. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. ద‌ర్శ‌కుడు రాహుల్ కూడా చాలా అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడు లాగా హై ఫై లెవ‌ల్ లో తీశాడు. న‌న్ను ఇన్ని విధాలుగా ఎంక‌రేజ్ చేసిన బ‌న్నీవాసు, మారుతిల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మ‌న హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ చాలా ఘ‌ట్స్ ఉన్న స్టార్‌. త‌న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ని మార్చ‌డం లేక ఎటువంటి మార్పు చెప్ప‌కుండా చేశాడు. క‌థ‌ను న‌మ్మి చేశాడు. తెలుగు ఇండస్ర్టీ ఊపిరి పీల్చుకో విజ‌య‌దేవ‌ర‌కొండ మ‌న‌కున్నాడు. ఎందుకంటే త‌న‌లాంటి హీరో వివిధ‌రకాలు, వివిధ జోనర్లు ఎంచుకుంటాడు. విజ‌య‌దేవ‌ర‌కొండ కింగ్ ఆఫ్ ద హిల్ ఇలానే ఆయ‌న‌కు ఎన్నో విజ‌యాలు రావాల‌ని అన్ని భాషల్లో ను న‌టించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All