Homeటాప్ స్టోరీస్`దేవి` మ‌హేంద్ర‌న్ హీరోగా `త‌నికీ కేంద్రం 1995`!

`దేవి` మ‌హేంద్ర‌న్ హీరోగా `త‌నికీ కేంద్రం 1995`!

తనిఖీ కేంద్రం 1995 పోస్టర్ ని విడుదల చేసిన డైరెక్టర్ మారుతి
తనిఖీ కేంద్రం 1995 పోస్టర్ ని విడుదల చేసిన డైరెక్టర్ మారుతి

`దేవి` చిత్రం ద్వారా బాల న‌టుడిగా అంద‌రిని ఆక‌ట్టుకున్న మ‌హేంద్ర‌న్ ఇటీవ‌ల సంక్రాంతికి విడుద‌లైన `మాస్ట‌ర్‌` చిత్రంతో మ‌రింత గుర్తింపుని సొంతం చేసుకున్నారు. త‌ను హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `త‌నికీ కేంద్రం `1995`. తెలుగులో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ `అంత‌ర్వేదం` ఫేమ్ చందిన ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హ‌ర్షిత ప్రొడ‌క్ష‌న్స్ , ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ సంద‌ర్భంగా ఈ చిత్రం మొద‌టి పోస్ట‌ర్ ని ద‌ర్శ‌కుడు మారుతి చేతుల మీదుగా విడుద‌ల చేశారు. డైరెక్ట‌ర్ మాట్లాడుతూ `పోస్ట‌ర్ చాలా విభిన్నంగా వుంద‌ని, ఇలాంటి సినిమాలు, ఇలాంటి యువ ద‌ర్శ‌కులు ప‌రిశ్ర‌మ‌కి చాలా అవ‌స‌రం అని అన్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `1995లో జ‌రిగిన ఒక య‌దార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాం. సినిమా ఖ‌చ్చితంగా ప్ర‌జ‌ల‌ని అల‌రిస్తుంద‌ని, ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తాం. ఈ చిత్రానికి విజ‌య్ కార్తీక్ రాసిన డైలాగ్స్ చాలా ప్ల‌స్ పాయింట్ గా నిలుస్తాయ‌ని` అన్నారు.

- Advertisement -

హీరో మ‌హేంద్ర‌న్ మాట్లాడుతూ “మాస్ట‌ర్‌` చిత్రంలో విజ‌య్ సేతుప‌తి టీనేజ్ రోల్ ఎంత పేరు తెచ్చిందో ఈ చిత్రం దానికి ప‌దింత‌లు  ఈ చిత్రం తెస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ర‌వికిషోర్ చందిన‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని వుంది. విజ‌య్ కార్తీక్ మాట‌ల అల‌రిస్తాయి` అన్నారు.  ష‌జ్ఞ‌శ్రీ‌వేణు హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాహుబ‌లి ప్ర‌భ‌క‌ర్‌, ప‌లాస ఫేమ్ ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, జ‌బ‌ర్ద‌స్త్ దొర‌బాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత‌లు: క‌ఓటేశ్వ‌ర‌రావు గూడెల‌, పి.వి. చంద్ర‌, సినిమాటోగ్ర‌ఫీ:  శివ‌కుమార్ దేవ‌ర‌కొండ‌, సంగీతం: ‌వినోద్ యాజ‌మాన్య‌, మాట‌లు : విజ‌య్ కార్తీక్ చెన్నం, సీజీ సంతోష్‌,

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All