Homeటాప్ స్టోరీస్సహాయ నటిని కిరాతకంగా చంపిన దర్శకుడు

సహాయ నటిని కిరాతకంగా చంపిన దర్శకుడు

Tamil cine actress sandhya murder caseతమిళ సహాయ నటిని దర్శకుడు ఆమె భర్త కిరాతకంగా చంపిన ఘటన సంచలనం సృష్టించింది . తమిళ చిత్రాల్లో సహాయ నటిగా నటించిన సంధ్య (38) అనే యువతి ని ఆమె భర్త దర్శకుడు అయిన బాలకృష్ణన్ దారుణంగా చంపాడు . సంధ్య – బాలకృష్ణన్ లు గతకొంత కాలంగా విభేదాలతో కాపురం కొనసాగిస్తున్నారు . రాత్రి పూట భార్య బయటకు వెళుతుండటంతో తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది . సంధ్య అక్రమ సంబంధాలు కొనసాగిస్తుండటంతో విచక్షణ కోల్పోయిన బాలకృష్ణన్ సంధ్య ని ముక్కలు ముక్కలుగా నరికి ఎక్కడెక్కడో పడేసాడు .

సంచలనం సృష్టించిన ఈ సంఘటన ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు . నిన్న దర్శకుడు బాలకృష్ణన్ ని అరెస్ట్ చేసి అన్ని వివరాలు రాబట్టారు . నాతో గొడవపడి ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డానని స్పష్టం చేసాడట బాలకృష్ణన్ . ఈ సంఘటన రెండు వారాల క్రితం జరుగగా నిన్న బాలకృష్ణన్ ని అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది .

- Advertisement -

English Title: Tamil cine actress sandhya murder case

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All