Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ లో తమిళ నటుడు

ఆర్ ఆర్ ఆర్ లో తమిళ నటుడు

Tamil actor Samuthirakani in RRR ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” . ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం హిందీ , తెలుగు , తమిళ , మలయాళ బాషలలో విడుదల కానుంది . దాంతో కేవలం టాలీవుడ్ ఆర్టిస్ట్ లను మాత్రమే కాకుండా ఇతర బాషా నటీనటులను కూడా తీసుకోనున్నారు జక్కన్న . అందులో భాగంగానే ఆర్ ఆర్ ఆర్ లో తమిళ నటుడు సముద్రఖని ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది .

చరణ్ బాబాయ్ గా సముద్రఖని నటించనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని వచ్చే నెల 19 నుండి జరుపుకోనుంది . రామోజీ ఫిలిం సిటీ లో అయిదు రోజుల పాటు రెండో షెడ్యూల్ ని చిత్రీకరించనున్నారు జక్కన్న . సముద్ర ఖని నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా . సముద్ర ఖని నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి , టాలీవుడ్ ప్రేక్షకులకు సముద్రఖని సుపరిచితుడే ! అయితే నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం మాత్రం ఇదే !

- Advertisement -

English Title: Tamil actor Samuthirakani in RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All