Homeగాసిప్స్మిల్కీ బ్యూటీతో మాస్ మహారాజా జోడి కట్టనున్నాడా?

మిల్కీ బ్యూటీతో మాస్ మహారాజా జోడి కట్టనున్నాడా?

మిల్కీ బ్యూటీతో మాస్ మహారాజా జోడి కట్టనున్నాడా?
మిల్కీ బ్యూటీతో మాస్ మహారాజా జోడి కట్టనున్నాడా?

ప్రస్తుతం మాస్ మహారాజా ప్లాపుల్లో ఉన్న విషయం తెల్సిందే. అయినా కానీ సినిమాల ఎంపికలో ఎక్కడా జోరు తగ్గించడం లేదు. రవితేజ నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంథోనీ, డిస్కో రాజా సినిమాలు ఒకటికి మించి మరొకటి ప్లాపులుగా మిగిలాయి. అయితే ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం క్రాక్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ సినిమాను సూపర్ స్పీడ్ తో షూట్ చేస్తున్నారు. మే నెలలో విడుదల చేయాలని చూస్తున్నారు.

ఇక ఇది కాకుండా రమేష్ వర్మ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను ఓకే చేసాడు. క్రాక్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే రమేష్ వర్మతో సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమాను ఓకే చేసాడు మాస్ మహారాజా.

- Advertisement -

ఇటీవలే లైట్ హార్టెడ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనెర్లు తెరకెక్కించడంలో త్రినాధరావు నక్కిన సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తనతో సినిమా అంటే తనకు కూడా కొత్తగా ఉంటుందని భావించాడు రవితేజ. అందుకే తను చెప్పిన కథను ఓకే చేసాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రవితేజ, తమన్నా కలిసి బెంగాల్ టైగర్ సినిమాలో నటించారు. అందులో వారి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఒక పాటలో తమన్నా గ్లామర్ విందు కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. త్రినాథరావు నక్కిన ఇటీవలే తమన్నాను కలిసి కథ చెప్పడం జరిగిందట. అయితే తమన్నా ఇంకా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

మరి రవితేజ సినిమాకు తమన్నా ఓకే చెబుతుందా? లేక నో అనేస్తుందా అనేది వేచి చూడాలి. ఈ ఏడాది చివరి నుండి రవితేజ – త్రినాథరావు నక్కిన సినిమా షూటింగ్ మొదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All