
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి చేస్తోన్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉంటె ఈ చిత్రం నుండి ప్రముఖ నటి వాకౌట్ చేసినట్లు సమాచారం.
రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కానీ ఆమె తమిళ్ కమిట్మెంట్స్ కారణంగా భీమ్లా నాయక్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది ఈ భామ. దీంతో చేసేది లేక వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో నటి కోసం నిర్మాతలు చూస్తున్నారు. సంయుక్త మీనన్ కు ఈ రోల్ దక్కే అవకాశముంది.
సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కు విశేష స్పందన వచ్చిన విషయం తెల్సిందే.