Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

‘ఐతే 2.ఓ’ ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

Talasani Srinivas Yadav  releases 'Aithe 2.0' Theatrical Trailerఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఐతే 2.ఓ’. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ విడుదల చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా.. తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ – ”పెరిగిన టెక్నాలజీలో సైబర్‌ క్రైమ్‌ను ఎలా చేస్తున్నారనే విషయాలను గమనిస్తూనే ఉన్నాం. దీన్ని ఓ మెసేజ్‌ క్రింద చూపిస్తూ ‘ఐతే 2.0’ను రూపొందించారు. కొత్త టీంతో ఏర్పడ్డ ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు. మెసేజ్‌తో పాటు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ సినిమాలను ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

దర్శకుడు రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ – ”ఈ సినిమాకు సంబంధించిన యు.ఎస్‌ హక్కులను ఫ్యాన్సీరేటుకు దక్కించుకున్నారు. ఆ ఆనందంలో ఉన్న సమయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌గారి చేతులు మీదుగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది” అన్నారు.

నిర్మాతల లో ఒకరైన కె.విజయరామరాజు మాట్లాడుతూ – ”ట్రైలర్‌ను తలసానిగారు విడుదల చేయడం హ్యాపీ. ఆయనకు మా టీం తరపున థాంక్స్‌. టెక్నికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది” అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, ఎడిటింగ్‌: కార్తీక్‌ పల్లె, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్‌ చిలువేరు. లైన్ ప్రొడ్యూసర్ : మహేష్ చదలవాడ , నిర్మాతలు : కె.విజయరామరాజు, డా.హేమంత్‌ వల్లపు రెడ్డి దర్శకత్వం: రాజ్‌ మాదిరాజ్‌.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts