Homeటాప్ స్టోరీస్సినీజీవులూ...! జర జాగ్రత్త

సినీజీవులూ…! జర జాగ్రత్త

సినీజీవులూ...! జర జాగ్రత్త
సినీజీవులూ…! జర జాగ్రత్త

“సినిమా అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది.” అది ఒకరి కోసం ఆగదు. ఒక్కళ్ళు వచ్చిన ఆగదు. అలాంటి సినిమా ప్రయాణంలో మనకు ఎంతో మంది కలుస్తూ ఉంటారు. అన్నీ బాగుంటే;అన్నీ అనుకున్న సమయానికి అనుకున్నట్లు జరిగితే; అంతా మంచిదే.. కానీ కొన్ని కొన్ని సార్లు ప్రకృతి మనల్ని పరీక్షించినప్పుడు, జాగ్రత్తగా ఉండాలి. అది అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో “మనం ఉన్నంతవరకు కాదు; మనం వెలుగులో ఉన్నంత వరకు మాత్రమే పట్టించుకుంటారు.” కాబట్టి కరోనా వైరస్ లాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది సినిమా తారలు మాత్రమే కాదు; సినీ జీవులు. హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు లాంటి స్టార్ల తోపాటూ.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 విభాగాల్లో పని చేసే అన్ని రకాల అసిస్టెంట్లు, ఎగ్జిక్యూటివ్ లు, మేనేజర్ లు, డ్రైవర్లు, లైట్ బాయ్స్, ఆర్ట్, సెట్,కెమెరా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వారు, ఫైటర్లు డ్యాన్సర్లు,మ్యూజిషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు,అసిస్టెంట్ రైటర్లు ఇంకా బ్రేక్ రాని చిన్న నటీనటులు, జూనియర్ ఆర్టిస్ట్ లు. ఎక్కువగా జనం ఉన్నా, ఎండా, వాన, వర్ష, చలి, దుమ్ము, రాళ్ళూ, ముళ్ళు, ఎడతెగని ప్రయాణాలు, నిద్ర లేకపోవడం, సమయానికి తినలేని పరిస్థితి… ఇలా ఎన్ని ఉన్నా… ఈ సినీజీవులు మళ్ళీ ఒక్కసారి సెట్ లో లైట్స్ వెలిగితే “రెడీ సార్..!” అంటారు.

ఎందుకంటే సినిమా స్టార్స్ కు చిన్న ఇబ్బంది వస్తే, వాళ్లకోసం షూటింగ్ వాయిదా వేయడమో.. లేదంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడంలో చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పైన మనం మాట్లాడుకున్న సినీ జీవుల విషయంలో వాళ్లకు ఒంట్లో అనారోగ్యం ఉన్నా, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా పని చేయడానికి వచ్చినప్పుడు అవన్నీ పంటి బిగువున భరిస్తూ.. వచ్చిన పని – నచ్చిన పని చేసుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్లకి కావలసింది.. ఇక్కడ నాలుగు మెతుకులు తినడమో, నాలుగు రాళ్లు సంపాదించడం లక్ష్యం కానేకాదు. తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఒక నాలుగు రోజుల పాటు ఇండస్ట్రీలో “మేమున్నాము..!” అని ప్రజల దృష్టిలో మరియు ఇండస్ట్రీ దృష్టిలో నిరూపించుకోవడం.

- Advertisement -

అలాంటి సినీ జీవులు కొన్ని సార్లు చాలా అశ్రద్ధగా ఉంటారు. ఇక టెక్నీషియన్లు అయితే వల్ల డిపార్ట్మెంట్ హెడ్ లేదా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేయాల్సిందే; ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లాల్సిందే; ఇలాంటి పరిస్థితుల్లో అయినా తర్వాత ఏదైనా కారణం వల్ల షూటింగ్ వాయిదా వేయొచ్చు గాక..! ముందు ఇండోర్ లో అవుట్ డోర్ లో పరిస్థితులను ఫేస్ చేసేది వాళ్లే. కాబట్టి సినిమాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఈ ఈ సినీ జీవులకు ప్రస్తుతం బయట పరిస్థితులు చక్కబడే అంతవరకు జాగ్రత్తగా ఉండమని.. మీకంటూ ఒక కుటుంబం, జీవితం ఉంటుందని ఒకసారి గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All