Homeటాప్ స్టోరీస్నిడివి ఎక్కువైతే తీసెయ్యాలి...సినిమా హిట్ అయ్యితే కలపాలి...

నిడివి ఎక్కువైతే తీసెయ్యాలి…సినిమా హిట్ అయ్యితే కలపాలి…

నిడివి ఎక్కువైతే తీసెయ్యాలి...సినిమా హిట్ అయ్యితే కలపాలి...
నిడివి ఎక్కువైతే తీసెయ్యాలి…సినిమా హిట్ అయ్యితే కలపాలి…

ఒక సినిమా అనుకున్నట్టు సరిగ్గా ఇంతే సమయం ఉండాలి అనుకుంటారు దర్శకులు. ఎందుకంటే ఒక చిన్న సీన్ ఎక్కువైనా కూడా మొత్తం సినిమాని హిట్ అనే టాపిక్ కి దూరం పెడుతుంది ఆ సీన్. సీన్ అని ఒక్కటే కాదు, అందులో పాట, ఫైట్ ఇలా ఏవైతే ఉంటే వాటిని ఎడిటింగ్ లో తీసేస్తారు. ఇప్పటికి చాలా మంది హాస్య కథానాయకులు మావి కొన్ని సీన్స్ బాలేదు, మంచిగా రాలేదు అని ఎడిటింగ్ లో తీసేసారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.

నిజానికి ఆ తప్పు ఒకరిది అని చెప్పలేం. ఎందుకంటే జనాల నాడి తెలిసిన బడా కథానాయకులు, దర్శకులు ఆ సీన్స్, పాటలు, ఫైట్స్ విషయంలో జాగ్రత్త పడి వాటిని తొలగిస్తారు. సినిమా హిట్స అయితే మళ్ళీ వాటిని కలుపుతారు సినిమాలో…..సరిగ్గా ‘సైరా నరసింహా రెడ్డి‘ విషయంలో కూడా అదే జరిగింది. రెండు పాటలు సినిమా నిడివిని పెంచాయి అని తొలగించేసారు. సినిమా నిడివి ఇప్పటికే 2 గంట 47 నిమిషాలు వచ్చింది ఇంకా ఆ రెండు పాటలు పెడితే కూడా నిడివి ఎక్కువ అయిపోతాయి, సినిమాకి మైనస్ లాగ మారిపోతాయి అని అనుకుని ఇలా చేసారు.

- Advertisement -

ఈ విషయాన్ని చిరంజీవి గారు సినిమా విడుదలకి ముందు రోజే చెప్పేసారు. కానీ మరి ఇప్పుడు సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడైనా ఆ పాటలని సినిమాలో కలుపుతారో లేక వీడియో పాటలు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారో చూద్దాం. గతం లో సురేందర్ రెడ్డి ‘కిక్ 2’ సినిమాలో కూడా ఒక పాటని తొలగించి సినిమా లాస్ట్ కి పేర్లు పడేటప్పుడూ ప్రసారం చేసారు. మరి సైరా విషయంలో సురేందర్ రెడ్డి కొద్దీ రోజూలు అయ్యాక పాటలని కలుపుతారో లేదా? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారో? లేదా అసలు పెట్టడం కూడా వదిలేస్తారేమో? చెప్పలేం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All