Homeగాసిప్స్అక్టోబర్ 2 న సైరా నరసింహారెడ్డి !

అక్టోబర్ 2 న సైరా నరసింహారెడ్డి !

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు . అయితే అంతకంటే ముందే అంటే గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది . దసరాకు గాంధీ జయంతి కి మధ్య న కేవలం నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ నాలుగు రోజులతో పాటుగా దసరా సెలవులు కూడా తమకు కలిసి వస్తాయని తద్వారా భారీ కలెక్షన్లు సాధించవచ్చని భావిస్తున్నాడట రాంచరణ్ .

- Advertisement -

ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో అమితాబ్ బచ్చన్ , నయనతార , తమన్నా , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే . భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది . అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా త్వరితగతిన పూర్తిచేసి అక్టోబర్ 2న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు . ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహా వ్యక్తి గాంధీ పుట్టినరోజున మరో స్వాతంత్య్ర సమరయోధుడు బయోపిక్ విడుదల అయితే అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి ఇచ్చే నిజమైన నివాళి అని భావిస్తున్నారట సైరా బృందం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All