Homeటాప్ స్టోరీస్సైరా అక్కడ లాభాల్లోకి అడుగుపెట్టిందోచ్

సైరా అక్కడ లాభాల్లోకి అడుగుపెట్టిందోచ్

సైరా అక్కడ లాభాల్లోకి అడుగుపెట్టిందోచ్
సైరా అక్కడ లాభాల్లోకి అడుగుపెట్టిందోచ్

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి బయట పరిస్థితి ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్టడీ కలెక్షన్స్ సాధిస్తోంది. 10 రోజులకు దాదాపు 95 కోట్ల షేర్ రాబట్టిన సైరా, ఎల్లుండికల్లా 100 కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయం. ఖైదీ నెం 150తో వరల్డ్ వైడ్ 100 కోట్ల మార్క్ ను అందుకుంటే, సైరాతో తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఫీట్ ను సాధించాడు.

ఇక సైరా ఉత్తరాంధ్రలో నేటితో సేఫ్ జోన్ కు చేరుకుంది. అక్కడ 14 కోట్లకు బిజినెస్ జరగగా 10 రోజుల్లోనే ఆ అమౌంట్ ను రికవర్ చేసుకోగలిగింది. వచ్చే వారం కూడా చిన్న చిత్రాలే విడుదల కానుండడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్ లాభాలను వెనకేసుకోవడం ఖాయం. మొదటినుండీ ఉత్తరాంధ్రలో చిరుకు మంచి ఫాలోయింగ్ ఉంది.

- Advertisement -

ఖైదీ నెం 150తోనే ఉత్తరాంధ్రలో బాహుబలి రికార్డులను చెరిపేసిన చిరు, సైరాతో నాన్ బాహుబలి 2 రికార్డులన్నిటినీ దాటేశాడు. మరోవైపు నైజాంలో కూడా సైరా 30 కోట్ల మార్క్ కు చేరువగా వచ్చింది. రేపటితో ఆ ఫీట్ కూడా సాధించనుంది. బాహుబలి సిరీస్ తర్వాత నైజాంలో 30 కోట్లు దాటిన సినిమాగా సైరా నిలిచింది. ఇక్కడ మరో వారం రోజులు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో నైజాంలో మరింతగా వసూళ్లను రాబట్టనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All