Homeటాప్ స్టోరీస్ఆగస్టు 21 న సైరా ...... టీజర్

ఆగస్టు 21 న సైరా …… టీజర్

sye raa narasimha reddy gets teaser release dateఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో దానికి ఒకరోజు ముందుగానే మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో జరగడం ఆనవాయితీగా వస్తోంది . దాంతో ఆగస్టు 21న ఉదయం 11 గంటలకు ” సైరా ……. నరసింహారెడ్డి ” టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి తప్పకుండా సైరా టీజర్ కానీ పోస్టర్ కానీ విడుదల చేస్తారని మెగా అభిమానులు ఆశించారు కానీ ఆ దిశగా ఏమి లేవని తెలియడంతో ఫ్యాన్స్ నిరాశకు గురౌతారు కాబట్టి టీజర్ ఎప్పుడు వస్తుందో అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని భావించి టీజర్ 21న వస్తున్నట్లు ప్రకటించారు .

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చరణ్ నిర్మిస్తుండగా మెగాస్టార్ తో పాటు నయనతార , అమితాబ్ బచ్చన్ , సుదీప్ , విజయ్ సేతుపతి , జగపతిబాబు తదితరులు నటిస్తుండగా ఓ చిన్న పాత్రలో నిహారిక కూడా నటించనుంది . ఇక ఈ చిత్రంలో మెగా హీరోలు కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది . వచ్చే ఏడాది వేసవిలో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: sye raa narasimha reddy gets teaser release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All