Homeటాప్ స్టోరీస్రాశిఖన్నా త‌న‌ని టార్చ‌ర్ పెట్టింద‌ట‌!

రాశిఖన్నా త‌న‌ని టార్చ‌ర్ పెట్టింద‌ట‌!

రాశిఖన్నా త‌న‌ని టార్చ‌ర్ పెట్టింద‌ట‌!
రాశిఖన్నా త‌న‌ని టార్చ‌ర్ పెట్టింద‌ట‌!

వ‌ర్మ తెర‌కెక్కించిన `నేక్డ్‌` (నగ్నం) చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన కాస్ట్యూమ్ డిజైన‌ర్ శ్రీ‌రాపాక‌.. అలియాస్ స్వీటీ వ‌ర్మ త‌ర‌హాలోనే ఇండ‌స్ట్రీలో గ‌త కొన్ని రోజులుగా ర‌చ్చ చేస్తోంది. న‌టి హేమ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లతో పాటు స్టార్ హీరోయిన్‌లు చూపిస్తే త‌ప్పు లేదు కానీ తాను చూపిస్తే త‌ప్పేంట‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాజా స్టార్ హీరోయిన్ రాశిఖ‌న్నాని టార్గెట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది.

గ‌తంలో కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేసిన స్వీటీ తాజాగా రాశిఖ‌న్నాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. గ‌తంలో రాశిఖ‌న్నా న‌టించిన `సుప్రీమ్‌` చిత్రానికి స్వీటీ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేసింద‌ట‌. ఆ స‌మ‌యంలో త‌న‌ని రాశిఖ‌న్నా టార్చ‌ర్ పెట్టింద‌ని ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌ను న‌టించిన `న‌గ్నం` సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా వ‌రుస‌గా యూట్యూబ్ ఛాన‌ల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న స్వీటీ ప్ర‌తీ ఇంట‌ర్వ్యూలోనూ ఏదో ఒక సంచ‌ల‌న విష‌యం వుండేలా ప్లాన్ చేసుకుంటూ ఇండ‌స్ట్రీ అవాక్క‌య్యేలా చేస్తోంది.

- Advertisement -

`సుప్రీమ్‌` చిత్రానికి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా త‌ను ప‌నిచేస్తున్న స‌మ‌యంలో రాత్రి మూడు గంట‌ల‌కు త‌న‌ని సారీ క‌ట్ట‌మ‌ని రాశిఖన్నా పిలిచిందని చెప్పింది స్వీటి. అసిస్టెంట్‌లు ఎవ‌రూ వ‌ద్ద‌ని త‌న‌నే సారీ క‌ట్ట‌మని పిలిచి రాశి టార్చ‌ర్ పెట్టింద‌ని, ఈ విష‌యం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి కూడా తెలుసున‌ని వెల్ల‌డించింది. మరి దీనిపై హీరోయిన్ రాశిఖ‌న్నా ఏమంటుందో చూడాలి అంటున్నారు సినీ జనం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All