
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురాం తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరి ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ మూడు వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..
నైజాంలో రూ. 33.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 12.57 కోట్లు, ఈస్ట్‌లో రూ. 8.52 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.63 కోట్లు, గుంటూరులో రూ. 8.47 కోట్లు, కృష్ణాలో రూ. 5.84 కోట్లు, నెల్లూరులో రూ. 3.50 కోట్లతో కలిపి రూ. 89.60 కోట్లు షేర్, రూ. 135.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.65 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 3 వారాల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 109.17 కోట్లు షేర్‌తో పాటు రూ. 178 కోట్ల గ్రాస్ సాధించింది.