Homeటాప్ స్టోరీస్సువర్ణసుందరి నుంచి "సాహో సార్వ భౌమి" సాంగ్ విడుదల

సువర్ణసుందరి నుంచి “సాహో సార్వ భౌమి” సాంగ్ విడుదల

suvarna sundari movie sahoooo saarva bhaumi song launchజయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం “సువర్ణసుందరి”. ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయి కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలొని “సాహో సార్వభౌమి” పాటను ఈ రోజు విడుదల చెశారు‌. ఈ సందర్బంగా సాయి కార్తీక్ మాట్లాడుతూ.. సువర్ణసుందరి ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ . దర్శకుడు సూర్య ఆడియెన్స్ థ్రిల్ అయ్యేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నా కెరీర్ లొ ఓ అత్యుత్తమ చిత్రం గా నిలిచి పొనుంది. ఈ సినిమా లొని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి.నాకు పర్సనల్ గా ఇష్టమైన “సాహొ సార్వభౌమి” పాట ఈ రొజు విడుదల చెస్తున్నారు. మ్యూజికల్ గా, విజువల్ గా ఉత్తమంగా వచ్చిన ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.

- Advertisement -

జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి. నిర్మాత: ఎమ్.ఎల్.లక్ష్మి, దర్శకత్వం: సూర్య ఎమ్‌.ఎస్.ఎన్

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All