Homeటాప్ స్టోరీస్సుశాంత్ ది ఆత్మ హ‌త్యే అని తేల్చారా?

సుశాంత్ ది ఆత్మ హ‌త్యే అని తేల్చారా?

సుశాంత్ ది ఆత్మ హ‌త్యే అని తేల్చారా?
సుశాంత్ ది ఆత్మ హ‌త్యే అని తేల్చారా?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న అనుమానాస్ప‌దంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అత‌ని మ‌ర‌ణానికి బాలీవుడ్‌లో వునన్న బంధుప్రీతే కార‌ణ‌మ‌ని, ఓ వ‌ర్గం వేధించ‌డం వ‌ల్లే సుశాంత్ మృతి చెందాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఆ త‌రువాత సుశాంత్ మృతికి ప్ర‌ధాన కార‌కురాలు రియానే అని డ్ర‌గ్స్ వివాదం త‌రువాత జాతీయ మీడియా కోడై కూసింది.

అయితే తాజాగా ఏమ్స్ డాక్ట‌ర్లు మాత్రం ఈ పుకార్ల‌కు చెక్ పెట్టారు. సుశాంత్‌ది ముమ్మాటికీ ఆత్మ హ‌త్యేన‌ని తేల్చేశారు. తీవ్ర‌మైన మాన‌సిక ఒత్తిడికి గురైన సుశాంత్ ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని సీబీఐకి నివేదిక‌ని అంద‌జేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే సుశాంత్ ఆత్మ హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణం ఏంటీ? అత‌న్ని ఆత్మ హ‌త్య చేసుకోవ‌డానికి ప్రేరేపించింది ఎవ‌రు? అనే కోణంలో సీబీఐ విచార‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

సుశాంత్ మృతికి డ్ర‌గ్స్‌కి ఏంటి సంబంధం? , ఇందులో రియా పాత్ర ఎంత‌? అనే కోణంలో విచార‌ణ జ‌రిగే అకాశం వుంద‌ని జాతీయ మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ కోణంలో అయినా సుశాంత్ మృతి వెన‌కున్న అస‌లు నిజం ఎప్ప‌టికి బ‌య‌ట‌ప‌డుతుందా? అని దేశ వ్యాప్తంగా కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All