Homeటాప్ స్టోరీస్ఓటీటీకే సై అంటున్న సూర్య సినిమా!

ఓటీటీకే సై అంటున్న సూర్య సినిమా!

ఓటీటీకే సై అంటున్న సూర్య సినిమా!
ఓటీటీకే సై అంటున్న సూర్య సినిమా!

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు తెరుచుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు దీంతో చాలా వ‌ర‌కు క్రేజీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే చాలా చిత్రాలు ఓటీటీ బాట‌ప‌ట్టాయి. త్వ‌ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్‌బాబు తొలిసారి క‌లిసి ర‌న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి` చిత్రం అమెజ‌న్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కాబోతున్న విష‌యం తెలిసిందే. ఇదే బాట‌లో సూర్య సినిమా కూడా ఓటీటీ బాట‌ప‌డుతోంది.

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జి.ఆర్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సూర్య కెరీర్ మ‌ళ్లీ ట్రాక్ ఎక్క‌డానికి కీల‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లోనే రిలీజ్ చేస్తార‌ని అంతా భావించారు కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని హీరో సూర్య తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు.

- Advertisement -

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న స్ట్రీమింగ్ కానుంది. ఇందు కోసం హీరో సూర్య‌తో అమెజాన్ ప్రైమ్ భారీ డీల్‌ని కుదుర్చుకుంద‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All