Homeటాప్ స్టోరీస్సూర్య ఈటీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

సూర్య ఈటీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

surya ET trailer released

ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..రీసెంట్ గా ఈటీ మూవీ తో మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేయగా.. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసారు. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ అయ్యింది. కాకపోతే సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

లాయర్ పాత్రలో సూర్య తన నటనతో అదరగొట్టారు. అయితే సినిమా పరమ రొటీన్ గా ఉందని మూవీ లవర్స్ పెదవి విరిచారు. పైగా విడుదలకు ముందు సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం మార్చి 11న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈటీ సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సన్ నెక్స్ట్ , నెట్ ఫ్లిక్స్ సంస్థలు కలిసి ఈటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ రేటుకు సొంతం చేసుకోగా , ఇప్పుడీ చిత్రాన్ని ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయాలని సదరు సంస్థలు డేట్ లాక్ చేసినట్లు సమాచారం. మరి వెండితెర ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ మూవీ , ఓటిటి ప్రేక్షకులను ఈమేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All