Homeగాసిప్స్పవన్ దర్శకుల లిస్ట్ లో చేరిన సురేందర్ రెడ్డి

పవన్ దర్శకుల లిస్ట్ లో చేరిన సురేందర్ రెడ్డి

పవన్ దర్శకుల లిస్ట్ లో చేరిన సురేందర్ రెడ్డి
పవన్ దర్శకుల లిస్ట్ లో చేరిన సురేందర్ రెడ్డి

ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వట్లేదు కానీ పవన్ కోసం దర్శకుల లిస్ట్ మాత్రం పెరిగిపోతూనే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను రీసెంట్ గా సురేందర్ రెడ్డి కలిశాడట. కలిసి సినిమా చేద్దామని సురేందర్ రెడ్డి ప్రపోజల్ పెడితే పవన్ కళ్యాణ్ తప్పకుండా అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎంతవరకూ సెట్ అవ్వగలదో చూద్దాం.

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తానని క్లారిటీ ఇచ్చాడు. పింక్ రీమేక్ లో నటించనున్నాడని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో బోణీ కపూర్ సమర్పణలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ రీమేక్ తెరకెక్కనుంది. జనవరి నుండి ఈ సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు. అయితే మాట ఇచ్చిన దగ్గరనుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారిపోయాడు. అధికార పార్టీని కొన్ని విషయాల్లో ప్రశ్నిస్తున్నాడు. ట్విట్టర్ లో కూడా దుమ్మెత్తిపోస్తున్నాడు. దీంతో దిల్ రాజు అండ్ కో మళ్ళీ డౌట్ లో పడ్డారు. అసలు పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నాడన్నది అర్ధం కావడంలేదు. అయితే జనవరి నుండి పింక్ రీమేక్, మార్చ్ లేదా ఏప్రిల్ నుండి క్రిష్ తో సినిమా చేయనున్నట్లు పవన్ సన్నిహితులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. డీన్ ప్రకారం క్రిష్ స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో కూడా పడ్డాడు. డిసెంబర్ కల్లా స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని అంటున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే మరోవైపు హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ సహకారంతో హరీష్ శంకర్ పవన్ తో టచ్ లో ఉంటున్నాడు. ఎలాగైనా సినిమాకు ఒప్పుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తనతో గబ్బర్ సింగ్ వంటి సినిమా తీసాడు కాబట్టి పవన్ కు కూడా సాఫ్ట్ కార్నెర్ ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ వారికి పవన్ దగ్గర తమ అడ్వాన్స్ ఉంది కాబట్టి ఈ సినిమా సెట్ అవ్వడం ముఖ్యమే. అయితే ఇది చాలదన్నట్లు ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. సురేందర్ ను కూడా మైత్రి సంస్థ వాళ్ళే పవన్ ను కలిపించారట. ఇక్కడ కూడా పవన్ సానుకూలంగానే స్పందించాడట. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గరా పాజిటివ్ గా ఉంటుండడంతో అసలు పవన్ తత్వమేంటో అర్ధం కావడంలేదు.

సురేందర్ రెడ్డి మొదట మహేష్ లేదా ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నించాడు. మహేష్ అయితే వచ్చే ఏడాది చివరి వరకూ ఖాళీ లేదని చెప్పేసాడు. ప్రభాస్ మాత్రం వచ్చే ఏడాది వేసవి తర్వాత చూద్దామన్నట్లుగా స్పందించాడట. మరి ఈలోగా సురేందర్ రెడ్డి పవన్ ను ఎందుకు కలిసినట్లు. అసలు పవన్ మనసులో ఏముంది? రెండు సినిమాలు చేసి ఆపేస్తాడు అన్నారు, కానీ వరసగా సినిమా వాళ్లకు ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తున్నట్లు?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All