Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ టైటిల్ కు సూపర్ రెస్పాన్స్

ఎన్టీఆర్ టైటిల్ కు సూపర్ రెస్పాన్స్

super response for ntrs aravindha sametha veera raghava యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు దాంతో నిన్న సాయంత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం టైటిల్ ని ప్రకటించడమే కాకుండా ఎన్టీఆర్ గెటప్ ని కూడా రిలీజ్ చేసారు . ఆ టైటిల్ కు అలాగే ఎన్టీఆర్ గెటప్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది , ఇక ఎన్టీఆర్ అభిమానుల సంతోషానికైతే అడ్డే లేకుండా పోయింది . ఎన్టీఆర్ మాస్ గెటప్ అంతగా నచ్చింది వాళ్లకు , ఎన్టీఆర్ అంటేనే మాస్ కి కేరాఫ్ అడ్రస్ పైగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ” అరవిందసమేత ” వీర రాఘవ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి .

ఎన్టీఆర్ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో రంభ తో పాటు పలువురు సీనియర్ నటీమణులు కూడా నటిస్తున్నారు . త్రివిక్రమ్ కు అజ్ఞాతవాసి ఘోరమైన దెబ్బ కొట్టింది ,దాంతో ఎన్టీఆర్ సినిమా అరవింద సమేత వీర రాఘవ తో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు త్రివిక్రమ్ . ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All