Homeటాప్ స్టోరీస్సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఛలో డైరెక్టర్

సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఛలో డైరెక్టర్

super-offer-for-venky-kudumulaనాగశౌర్య హీరోగా నటించిన ఛలో సూపర్ హిట్ కావడంతో ఆ దర్శకులు వెంకీ కుడుములకు ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . అయితే అన్నిన్నిటిని మించి హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఆఫర్ ఇవ్వడం మరీ విశేషం . ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాత రాధాకృష్ణ వెంకీ కి భారీ ఆఫర్ ఇచ్చాడట ! ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లతో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు రాధాకృష్ణ . ఇటీవలే పవన్ కళ్యాణ్ తో తీసిన అజ్ఞాతవాసి చిత్రం భారీ డిజాస్టర్ కావడంతో కాస్త ఇబ్బందిగా ఉన్న ఈ సమయంలో వెంకీ ఛలో తో సూపర్ హిట్ కొట్టడం , అతడ్ని హారికా హాసిని క్రియేషన్స్ బుక్ చేసుకోవడంతో చక చకా జరిగిపోయాయి .

త్రివిక్రమ్ శిష్యుడైన వెంకీ కుడుముల రాధాకృష్ణ బ్యానర్ లో తన రెండో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . రాధాకృష్ణ నుండే కాక ఇంకా పలు ఆఫర్లు వస్తున్నాయి వెంకీ కి . అయితే అన్నీ ఒప్పేసుకోకుండా ఆచి తూచి అడుగేస్తున్నాడు వెంకీ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All