
విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్.. రెండో సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. ఈయన హీరోగా నటించిన రెండో సినిమా సూపర్ మచ్చి. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఎలాంటి అంచనాలు , ప్రమోషన్ లేకుండా సంక్రాంతి బరిలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది.
కాకపోతే కళ్యాణ్ దేవ్ ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతో పోలిస్తే ఈయన నటనలో మెరుగుదల కనిపించింది. బాధ్యతలేని యువకుడిగా, చూడని ప్రియురాలి కోసం తపన పడే ప్రేమికుడిగా బాగానే ఉన్నాడు కళ్యాణ్. ఫైట్స్, డ్యాన్సులు బాగా చేశాడు. కన్నడ హీరోయిన్ రచిత రామ్ బాగానే నటించింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అయినప్పటికీ కథ , కథనం బాగాలేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్నీ అమెజాన్ అధికారిక ప్రకటన చేసింది.