Homeటాప్ స్టోరీస్సమంత కష్టం వృధా కాలేదు

సమంత కష్టం వృధా కాలేదు

భర్త నాగచైతన్య కు హిట్ రావాలి , మజిలీ చిత్రం హిట్ కావాలి అని సమంత కాలినడకన తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లిన విషయం తెలిసిందే . సమంత మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకోగా నాగచైతన్య మాత్రం హాయిగా కారులో వెళ్ళాడు కొండపైకి . మొత్తానికి ఎంతో కస్టపడి కాలినడకన వెళ్ళింది మొక్కుకుంది.

- Advertisement -

సమంత కొండపైకి వెళ్లి మొక్కిన మొక్కు వృథా కాలేదు , ఆ దేవుడు ఆలకించి చైతన్య కు సూపర్ హిట్ నిచ్చాడు మజిలీ చిత్ర రూపంలో . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మజిలీ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే . ఈ చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ వచ్చింది . ఇక నటుడిగా కూడా చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా నటనలో కూడా చైతు ని మరో లెవల్ కి తీసుకెళ్లింది ఈ మజిలీ .

గత ఏడాది చైతన్య నటించిన రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో సమంత కొంత ఆందోళనకు గురయ్యింది . సమంత ఏమో వరుస విజయాలు సాధిస్తూ పోతుంటే నాగచైతన్య మాత్రం ఆ స్థాయిలో అలరించలేక పోతున్నాడు దాంతో భర్త కోసం తిరుమల కొండెక్కి మరీ మొక్కుకుంది . ఇంకేముంది ఆ మొక్కు కి దేవుడు కూడా కరిగిపోయాడు …… వెంటనే ఫలితాన్ని ఇచ్చాడు మజిలీ హిట్ రూపంలో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All