Homeటాప్ స్టోరీస్సన్నీ లియోన్ బయోపిక్ కూడా వస్తోంది

సన్నీ లియోన్ బయోపిక్ కూడా వస్తోంది

sunny leone biopic webseriesబయోపిక్ చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడింది , బాలీవుడ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులపై బయోపిక్ లు వచ్చాయి ఇక తెలుగులో తాజాగా సావిత్రి బయోపిక్ మహానటి వచ్చిన విషయం తెలిసిందే . ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ మీద ఉంది . ఇక ఇప్పుడేమో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బయోపిక్ టైం వచ్చింది . అయితే ఇది వెండితెర మీద రావడం లేదు వెబ్ సిరీస్ గా వస్తోంది . వెండితెర మీద కాకుండా వెబ్ సిరీస్ గా ఎందుకు తీస్తున్నారో తెలుసా ……. వెండితెర మీద అయితే సన్నీ లియోన్ పోర్న్ స్టార్ కాబట్టి సెన్సార్ ఇబ్బందులు వస్తాయి అందుకే వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నారు .

మరో విచిత్రం ఏంటంటే ఈ బయోపిక్ లో స్వయంగా తన పాత్రని సన్నీ లియోన్ పోషించడం . సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా ఎలా మారింది , ఆమె జీవితం ఏంటి ? పోర్న్ స్టార్ గా ఆ లైఫ్ ని ఎందుకు వద్దని అనుకుంది ? బాలీవుడ్ లోకి ఎలా వచ్చింది ? ఆమె ఆలోచనలు ఏంటి ? తదితర అంశాలతో సన్నీ లియోన్ బయోపిక్ రూపొందుతోంది . అయితే సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా ఉన్నప్పటి సన్నివేశాలకు వెబ్ సిరీస్ అయితే ఎలాంటి సెన్సార్ అవసరం లేదు కాబట్టి పైగా కథలో కీలకమైన సన్నివేశాలు అవే కాబట్టి వెబ్ సిరీస్ ని ఎంచుకున్నారు . మొత్తానికి బయోపిక్ లకు పరాకాష్ట సన్నీ లియోన్ బయోపిక్ అనడంలో సందేహం లేదు . ఇక ఈ వెబ్ సిరీస్ కు టైటిల్ ఏంటో తెలుసా ……. ”కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ ” . ఇంతకీ కరణ్ జీత్ కౌర్ ఎవరా అని అనుకుంటున్నారా ? సన్నీ లియోన్ అసలు పేరు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All