
వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పవన్ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభ లో పొత్తుల ఫై క్లారిటీ ఇచ్చే సరికి అంత జనసేన గెలుపు ఖాయం అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. జనసేన, తెలుగుదేశమ్ పార్టీలు పొత్తు ఖాయంగా కనిపిస్తుంది. మరి వీరితో బిజెపి కలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటె తాజాగా భీమవరం నుండి జనసేన అభ్యర్థిగా నటుడు సునీల్ పేరు ఖాయం అన్నట్లు ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లు ప్రాణ స్నేహితులే కాదు అంతకు మించి అనేది తెలిసిందే. త్రివిక్రమ్ ఏమిచెపితే పవన్ అది చేస్తాడు.
ఈ తరుణంలో త్రివిక్రమ్‌కి తన ప్రాణ స్నేహితుడు… హీరో సునీల్ జనసేన చేర్పించబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విశాఖలోని గాజువాకతో పాటు.. కోస్తా జిల్లాలోని భీమవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల బరిలో జనసేన అధినేత గతంలో పోటీ చేసి ఓడిపోయిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాకుండా.. కోనసీమలోని కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న స్థానాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
ఈ తరుణంలో భీమవరం బరిలో హీరో సునీల్‌ని రంగంలోకి దింపబోతున్నారనేది హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌కి.. త్రివిక్రమ్‌కి అత్యంత సన్నిహితుడు మాత్రమే కాకుండా.. భీమవరం లోకల్ కావడంతో హీరో సునీల్ ఫ్యాన్ బేస్ బాగా ఉండటంతో వాటిని ఓట్లుగా మలుచుకోవాలనే ప్లాన్‌లో భాగంగా.. జనసేన అభ్యర్థిగా హీరో సునీల్‌ని నిలబెట్టబోతున్నారనే పుకార్లు భీమవరం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి మరి ఇది నిజామా కదా అనేది చూడాలి.