Homeగాసిప్స్సునీల్ ఆశలన్నీ ఆ చిత్రంపైనే...

సునీల్ ఆశలన్నీ ఆ చిత్రంపైనే…

సునీల్ ఆశలన్నీ ఆ చిత్రంపైనే...
సునీల్ ఆశలన్నీ ఆ చిత్రంపైనే…

కమెడియన్ గా సునీల్ స్థాయి గురించి చెప్పేదేముంది. ఎన్నో సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే పాత్రలు వేసాడు. సునీల్ లేకుండా సినిమా లేదనే స్థాయికి ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాల నుండి చిన్న స్థాయి హీరోల వరకూ అందరూ తమ సినిమాల్లో సునీల్ ను కోరుకునేవారు. ఇప్పటి జనరేషన్ కు అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ కు ఎలాంటి హవా ఉందో దానికంటే ఎక్కువ క్రేజ్ సునీల్ కు అప్పట్లో ఉండేది. అయితే సునీల్ కమెడియన్ పాత్రలకు దూరమవడంతో ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చాడు వెన్నెల కిషోర్. ప్రతి కమెడియన్ కు వచ్చినట్లే సునీల్ కు కూడా హీరోగా అవకాశాలు వచ్చాయి. బ్రహ్మానందం, అలీ, అంతెందుకు కృష్ణ భగవాన్ కూడా హీరోగా ప్రయత్నించాడు. కానీ సునీల్ ఒక్కడే హీరోని సీరియస్ గా తీసుకున్నాడు. మిగతా కమెడియన్లు హీరోలుగా చేసినా సమాంతరంగా కామెడీ పాత్రలు కూడా చేసారు. అయితే సునీల్ మాత్రమే కేవలం హీరో పాత్రలకు పరిమితమయ్యాడు. కామెడీని పూర్తిగా దూరం పెట్టేసాడు. అదే అతనికి శాపంగా మారింది.

సాధారణంగా కమెడియన్లు హీరోలుగా మారితే వారు ఎక్కువ కాలం కొనసాగలేరు. ఈ విషయంలో అలీ ప్లానింగ్ ను మెచ్చుకోవాలి. హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూ కమెడియన్ గానే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. చేసిన సినిమాలు కూడా ఎక్కువ కామెడీ ప్రధానంగా తీసుకున్నదే. కానీ సునీల్ ఈ విషయంలో తప్పటడుగు వేశారు. మొదట్లో హీరోగా కామెడీ బేస్డ్ సినిమాలు చేసినా తర్వాత అన్ని ఎమోషన్స్ ఉండే సినిమాలను ఎంచుకున్నాడు. అయితే సునీల్ ను కామెడీ పాత్రల్లో చూసిన జనాలు ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ లో చూడటానికి ఇష్టపడలేదు. సునీల్ మీద అభిమానమున్నా అతని నుండి జనాలు ఫుల్ లెంగ్త్ హీరోయిజాన్ని కోరుకోలేదు. అందుకే వరసగా సునీల్ సినిమాలు బెడిసికొట్టాయి. హీరోగా తనకు మార్కెట్ లేదని గ్రహించిన సునీల్ మళ్ళీ కమెడియన్ అవ్వడానికి ప్రయత్నించాడు.

- Advertisement -

‘అరవింద సమేత’ లో సునీల్ క్యారెక్టర్ వేసినా కానీ అది సీరియస్ రోల్ కావడంతో సునీల్ కు వచ్చిన ప్రత్యేకమైన గుర్తింపంటూ ఏం లేదు. చిత్రలహరిలో సునీల్ కు కామెడీ టచ్ ఇచ్చినా అదేమంత హిలేరియస్ రోల్ కాదు. దీంతో సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ అంత ఎఫెక్టివ్ గా లేదనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం అతనికి అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ప్రస్తుతం సునీల్ ముందు ఉన్న ఒకే ఒక్క అవకాశం అల వైకుంఠపురములో. తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి సునీల్ కు హిలేరియస్ రోల్ ఇచ్చాడని తెలుస్తోంది. సునీల్ కమెడియన్ గా స్థిరపడడానికి త్రివిక్రమ్ ఎంతో సహకారం అందించాడు. తన పాత్రకు హిలేరియస్ డైలాగులు రాసేవాడు. చాలా సినిమాలకు రికమండేషన్ కూడా చేసేవాడు. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీలో నిలదొక్కుకోవడానికి మళ్ళీ త్రివిక్రమ్ సహాయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, సునీల్ మధ్య సన్నివేశాలు అలరిస్తాయని తెలుస్తోంది. మరి అల వైకుంఠపురములో సునీల్ కెరీర్ ను కాపాడుతుందా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All