Homeటాప్ స్టోరీస్సుబ్రమణ్య పురం ట్రైలర్ టాక్

సుబ్రమణ్య పురం ట్రైలర్ టాక్

Sumanth's Subrahmanyapuram trailer talk సుమంత్ హీరోగా రూపొందిన చిత్రం సుబ్రమణ్యపురం . సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ని నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో అక్కినేని అఖిల్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసాడు . సుబ్రమణ్యపురం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది . దేవుడి మీద గెలుపు కోసం ప్రయత్నించే ఓ యువకుడి కథతో ఈ చిత్రం రూపొందింది . సుమంత్ హీరోగా పరిచయమై దాదాపు 20 ఏళ్ళు . అయితే ఇన్నేళ్ల కెరీర్ లో సత్యం చిత్రం మాత్రమే సూపర్ హిట్ , ఇక మిగతా చిత్రాలన్నీ పరాజయాల బాట పట్టాయి .

అయితే ఆమధ్య వచ్చిన ” మళ్ళీ రావా ” చిత్రంతో సరికొత్త జర్నీ మొదలు పెట్టాడు సుమంత్ . చాలాకాలం తర్వాత మళ్ళీ రావా చిత్రంతో హిట్ అందుకున్నాడు . ఆ సినిమా ఇచ్చిన జోష్ తో సుబ్రహ్మణ్యపురం చిత్రం చేసాడు సుమంత్ . ఈ ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా మళ్ళీ హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నాడు సుమంత్ . విభిన్న కథాంశంతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాగా ఆ కోవలో సుమంత్ చిత్రం కూడా చేరేలా ఉంది . ఈషా రెబ్బా కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది .

- Advertisement -

English Title: Sumanth’s Subrahmanyapuram trailer talk

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All