Homeటాప్ స్టోరీస్అక్కినేని బయోపిక్

అక్కినేని బయోపిక్

Sumanth eyes on Akkineni Biopicఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం విడుదల కావడంతో అందులో నటించిన సుమంత్ గురించి అక్కినేని బయోపిక్ గురించి చర్చ మొదలయ్యింది . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో అక్కినేని మనవడు సుమంత్ నటించాడు . సుమంత్ నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్పాలి ఎందుకంటే అక్కినేనిని గుర్తు చేసాడు సుమంత్ . దాంతో అక్కినేని బయోపిక్ చర్చ మొదలయ్యింది .

చదువు లేదు , ఎన్టీఆర్ తో పోలిస్తే పెద్ద అందగాడు కాదు ….. పైగా ఆడ వేషాలు వేసిన వ్యక్తి అయినప్పటికీ మహానటుడు గా ఎదిగాడు అక్కినేని . ఎన్టీఆర్ కు సమ ఉజ్జీ అనిపించుకున్నాడు . అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నాడు . కటిక పేదరికం నుండి శ్రీమంతుడిగా ఎదిగాడు , బైపాస్ సర్జరీ అయ్యాక కూడా 90 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తి అక్కినేని అలాంటి సంచలన వ్యక్తి బయోపిక్ తీయాలి , ప్రేక్షక లోకానికి చెప్పాలి . అయితే నాగార్జున మాత్రం నాన్న బయోపిక్ అవసరం లేదు ఎందుకంటే నిండైన జీవితం చూసాడు అని బయోపిక్ కు మోకాలడ్డుతున్నాడు . సుమంత్ ని అక్కినేని గా చూసైనా తన ఆలోచన మార్చు కుంటాడేమో చూడాలి .

- Advertisement -

English Title: Sumanth eyes on Akkineni Biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All