Homeటాప్ స్టోరీస్సుమన్ ని టాలీవుడ్ ఎందుకు తక్కువ అంచనా వేస్తోంది.?

సుమన్ ని టాలీవుడ్ ఎందుకు తక్కువ అంచనా వేస్తోంది.?

Suman 100th movie ayyappa kataksham
Suman 100th movie ayyappa kataksham

హీరో సుమన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆరడుగుల అందగాడిగా తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాలు నటించారు ఆయన. ఒక్క గొంతు తప్పితే ఒక హీరోగా ఆయనకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి. చిరంజీవి తరువాత నటనను వారసత్వంగా తమ కొడుకులకు అందించి, తెలుగు చిత్ర సీమకు “బాబు” లను హైలెట్ చేసే బాద్యత ఎత్తుకున్న అప్పటి స్వార్ధపూరిత మీడియా భాను చందర్, సుమన్ లతో పాటుగా ఎంతోమంది హీరోలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వలేదు.

తరువాత అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామీ గా, శ్రీ రామదాసు సినిమాలో రాముడిగా, గౌతమ బుద్ధ సినిమాలో బింబిసారుడిగా సుమన్ అద్భుత నటన ప్రదర్శించారు. కానీ ఇప్పటికి తెలుగు చిత్రసీమలో నిర్మాతలు, దర్శకులు, ఆయనకు హీరో తండ్రి లేదా, ఎదో ఒక పోలీసు ఆఫీసర్ పాత్రలు ఇస్తున్నారు,తప్ప పూర్తి స్థాయి క్యారెక్టర్ లు ఇవ్వడంలేదు. తాజాగా సుమన్ తన 100వ సినిమా అయ్యప్ప కటాక్షం అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాలో సుమన్ తో పాటు సీనియర్ నటి రమా ప్రభ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కథా, కథనాలు మరియు ప్రొడక్షన్ విలువల పరంగా బలహీనంగా ఉన్నా, గురుస్వామిగా సుమన్ నటన అద్భుతంగా ఉంది. ప్రస్తుతం శబరిమల దేవస్థానంలో రుతు క్రమం లో ఉన్న స్త్రీ లు కూడా, ప్రవేశించాలనే విషయమ పై భారీ స్థాయిలో వివాదం నడుస్తోంది.

- Advertisement -

మరి ఈ సినిమాలో అయ్యప్ప దీక్ష, మరియు శబరిమల గొప్పతనం గురించి ఏ మేరకు చూపిచారనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All