Monday, December 5, 2022
Homeటాప్ స్టోరీస్పుష్ప ట్రైలర్ డైలాగ్స్ దద్దరిల్లిపోవాల్సిందే..!

పుష్ప ట్రైలర్ డైలాగ్స్ దద్దరిల్లిపోవాల్సిందే..!

Sukumar Allu Arjun Planing to Release Pushpa Trailer
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ 17న రిలీజ్ కు సిద్ధమవుతుంది. సినిమా నుండి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే అంచనాలు పెంచగా సినిమా ట్రైలర్ తో ఆ అంచనాలను రెట్టింపు చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్. డిసెంబర్ మొదటి వారంలో పుష్ప ట్రైలర్ రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పుష్ప ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తారని టాక్.

- Advertisement -

ఇక ట్రైలర్ లో సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ రివీల్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే దేవి సాంగ్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెరగగా ఇక ట్రైలర్ తో వాటిని పెంచేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది.

సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో అసలు విలన్ గా మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. రెండు పార్టులుగా రానున్న పుష్ప సినిమా పార్ట్ 1 డిసెంబర్ 17న వస్తుంది. పుష్ప ట్రైలర్ డైలాగ్స్ తో అదరగొడాతరని తెలుస్తుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts