Homeటాప్ స్టోరీస్సినీ అతిరథుల సమక్షంలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ గ్రాండ్ లాంచ్

సినీ అతిరథుల సమక్షంలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ గ్రాండ్ లాంచ్

Sudhir Babu Productions Grand Launchఘట్టమనేని కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు నటుడిగా తనదైన ముద్రవేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనసున్న హీరోగా కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు నిర్మాతగా ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు హాజరై సుధీర్ బాబుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… సుధీర్ బాబుకు కంగ్రాట్స్. ఏ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడని చూడకుండా… తన సమర్థత తెలుసుకొని.. దాని మీద ప్రయాణం చేసే మంచి మనసున్న మంచి వ్యక్తి. ఇతనికి కృష్ణ గారు, మహేష్ బాబు ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి… ఆడియో లాంచ్ లో కనిపించినా… వాళ్ల ప్రభావం లేకుండా తనకంటూ ఓ మార్క్ వేసుకుంటున్నాడు. భాగీ అనే సినిమాలో షాక్ ఇచ్చాడు. ఇతని కసి ఎంత ఉంది అని ఆ సినిమాలో చూసినప్పుడు కనిపించింది. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను.

- Advertisement -

దిల్ రాజు మాట్లాడుతూ… సుధీర్ బాబు నిర్మాత అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. సుధీర్ ను గత 15 సంవత్సరాలుగా చుస్తున్నాను. ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఆయన స్నేహితులు యువి వంశి, బన్నీ వాసు, 70ఎం ఎం విజయ్ నిర్మాతలయ్యారు. ఇప్పుడు సుధీర్ కూడా సక్సెస్ ఫుల్ నిర్మాత కావాలని కోరుకుంటున్నా. అని అన్నారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ… కెరీర్ గా ప్రారంభించినప్పటి నుంచి ప్రొఫెషనలిజం సూపర్బ్ గా ఉన్న కొద్ది మంది హీరోల్లో ఒకరు. నా ఫ్యామిలీలో ఒకరు సుధీర్. గీతా ఆర్ట్స్, పద్మాలయ, దిల్ రాజు బ్యానర్స్ లాంటి రేంజ్ లో దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు.

సందీప్ కిషన్…. సుధీర్ బాబు నాకు చాలా ఇష్టం. గౌరవం కూడా. యాక్టర్ గా కూడా నాకు ఇన్పిరేషన్. ప్రొడ్యాసర్ గా మారాలంటే ధైర్యం కావాలి. నటుడు నిర్మాత కావాలంటే ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి. హీరోగా రావాలనుకున్నప్పుడు… 77 మంది దగ్గర అప్పు చేసి ఎస్ ఎమ్ ఎస్ సినిమా చేశారు. అది తన కమిట్ మెంట్. ఈసినిమా ద్వారా బాగా డబ్బులు.. మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.

లగడపాటి శ్రీధర్… నిర్మాతగా మారడం చాలా హ్యాపీగా ఉంది. చాలా డేరింగ్ స్టెప్ వేస్తున్నాడు. వంద పెళ్లిళ్లతో సమానం సినిమా చేయడం అంటే. ఎంతో మందికి భోజనం పెట్టిన వాడివి అవుతావు. లోగోలో చాలా స్టార్స్ ఉన్నావు. గో లాంగ్ వే. నీ బ్యానర్లో పెద్ద హిట్స్ ఇస్తావని నమ్ముతున్నాను. నా బ్యానర్లో సినిమా చేశాను. నాకు తెలుసు అతని కమిట్ మెంట్. అతను ఓ సినిమా కోసం ఎంతగా ప్రిపేర్ అవుతాడో నాకు తెలుసు. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేస్తారని ఆశిస్తున్నాను.

శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ… కంగ్రాట్స్ అన్నా. భలే మంచి రోజు షూటింగ్ అప్పుడు చెప్పారు.. చాలా కష్టపడి వచ్చారని. గుడ్ కంటెంట్ ఉంటే ఎప్పుడు ముందుంటాడు. యంగ్ స్టర్స్ చాలా మందిని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను.

వంశీ పైడి పల్లి మాట్లాడుతూ… సుధీర్, వంశీ, విజయ్ నాకు ప్రభాస్ ద్వారా పరిచయం అయ్యారు. సుధీర్ బిజినెస్, బ్యాడ్మింటన్ లో బిజీ గా ఉండేవాడు. ఈరోజు వంశీ యువి క్రియేషన్స్ ద్వారా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. విజయ్ నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా ఉన్నాడు. ఇప్పుడు సుధీర్ నిర్మాతగా మారాడు. కృష్ణ గారికి అల్లుడు అవ్వకమందే నాకు తెలుసు ఎంతగా కష్టపడతాడో. ఆల్ ది బెస్ట్ సుధీర్. అని అన్నారు.

 

కృష్ణ చైతన్య మాట్లాడుతూ… ఎస్ ఎమ్ ఎస్, భలే మంచి రోజు సినిమాలకు పాటలు రాశాను. ఆయనలో నేను నిజాయితీ చూశాను. ఎంతో మంది మంచి డైరెక్టర్స్ కి అవకాశం కల్పించాలని కోరుతున్నాను.

 

సుధీర్ బాబు మాట్లాడుతూ… ఈ ఈవెంట్ ద్వారా చాలా నేర్చుకున్నాను. నిర్మాతగా నా ప్రయాణం ఈ ఈ వెంట్ తో ప్రారంభమైంది. నేను నిర్మాతగా మారడానికి కారణం నేను చేసిన సినిమాలే ఓ కారణం.
ఇక నా ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమా 80 శాతం పూర్తయింది. నేను ప్రస్తతం ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ గానీ టైటిల్ గానీ ఇప్పుడే రివీల్ చేయట్లేదు. ఎందుకంటే నేను సమ్మోహనం అనే సినిమా చేస్తున్నాను. ఆ సినిమా రిలీజ్ తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన వివరాల్ని బయటికి ఇవ్వాలనుకుంటున్నాను. కొత్త దర్శకుడితో పని చేస్తున్నాను. శ్రీ రామ్ ఆదిత్య లాగా మంచి టాలెంట్ ఉన్న నటుడు. మా బ్యానర్ ను ఎలా గ్రాండ్ గా లాంచ్ చేశామో అలాగే మా టీం ను కూడా పరిచయం చేస్తాం. నటుడిగా చాలామంది ప్రతిభావంతులను చూశా. ఏదో ఒక రోజు నేను ప్రొడక్షన్ చేసే స్టేజి వుంటే… కొత్తవాళ్ళను కొంతమందిని తీసుకుని ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నా. అలాగే, స్టార్ట్ చేశా. ఇప్పటివరకూ నా దగ్గరకు ప్రతి ఒక్కరూ నన్ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకొని వచ్చారు. భవిష్యత్తులో మంచి కథ వచ్చి, నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే… ఎట్ ద సేమ్ టైమ్, నాకంటే వేరే హీరోలు ఎవరైనా ఈ కథకు సూట్ అవుతారని అనుకుంటే… తప్పకుండా చేస్తా. మంచి కథను పోగొట్టుకోలేను. పద్మాలయ… తరవాత కృష్ణ ప్రొడక్షన్స్… దాని తరవాత ఇందిరా ప్రొడక్షన్స్ వుంది. తరవాత మ‌హేశ్‌బాబు ప్రొడక్షన్స్ వుంది. అలాగే, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ వుంటుంది. జోక్స్ పక్కన పెడితే… నేను ఎప్పుడూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని అనుకుంటాను. నా యాక్టింగ్ కెరీర్ చూస్తే.. పక్కన కృష్ణగారు, మహేశ్ వున్నా ఏదో వాళ్ళను వాడేసుకోని ఎప్పుడూ సినిమాలు చేయాలనుకోలేదు. ఐ వాంట్ టు గ్రో ఇండిపెండెంట్‌లీ. అందులో నాకు శాటిస్‌ఫ్యాక్ష‌న్‌ ఎక్కువ వుంటుంది. నేను సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టడానికి అదే రీజన్. నా ముందు అల్లు అరవింద్ గారు, ‘దిల్’ రాజు గారు… ఇంకా ఎంతోమంది వున్నారు. వాళ్ళు ఎన్నో మంచి సినిమాలు, జనాలకు గుర్తుండే సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు చేయాలనేది నా విజన్. నేను ప్రొడ్యూసర్ అవుతానని అనుకోలేదు. నెమ్మదిగా ప్రొడ్యూసర్ అయ్యాను. బహుశా… దర్శకుణ్ణి కూడా అవుతానేమో. ప్రస్తుతానికి అటువంటి ఆలోచనలు ఏమీ లేవు.
ఫస్ట్ ప్రిఫరెన్స్ బయట ప్రొడక్షన్‌లో చేయడానికి ఇస్తా. ఖాళీగా వున్నప్పుడు నా బ్యానర్‌లో చేసుకుంటా. ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని అన్నీ సినిమాలు నేనే చేసుకుంటానని అనుకోవద్దు. అని అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All