Homeటాప్ స్టోరీస్సడెన్ గా సైరా కలెక్షన్స్ పైకి

సడెన్ గా సైరా కలెక్షన్స్ పైకి

సడెన్ గా సైరా కలెక్షన్స్ పైకి
సడెన్ గా సైరా కలెక్షన్స్ పైకి

దసరా సెలవులు అయిపోయాయి కదా ఇక సైరా పని అయిపోయినట్టే అని చాలా మంది ట్రేడ్ పండితులు సైరా ఫేట్ ను ఊహించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ సైరా సెలవు రోజు కంటే వర్కింగ్ డే నాడు ఎక్కువ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా సైరా నైజాంలో ఒక్కరోజే 2 కోట్లకు పైగా షేర్ సాధించడం విశేషమనే చెప్పాలి.

నైజాం హక్కులను దాదాపు 30 కోట్లకు అమ్మారు. తొలి మూడు రోజుల తర్వాత సైరా కలెక్షన్స్ డల్ అయ్యాయి. కనీసం ఆదివారం కూడా చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడంతో నైజాంలో సైరాకు నష్టాలు తప్పేటట్లు లేవు అనుకున్నారు. కానీ లేట్ గా సైరా కలెక్షన్స్ లో దూకుడు కనిపిస్తోంది. ఇప్పటికే 27 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో ట్రెండ్ ఇలాగే కొనసాగితే వీకెండ్ పూర్తయ్యేలోగా సైరా ఇక్కడ లాభాల్లోకి వెళుతుంది.

- Advertisement -

ఉత్తరాంధ్ర, వైజాగ్ లో కూడా సైరా ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అవ్వడానికి దగ్గర్లో ఉంది. ఆ మాటకొస్తే సైరా ఫుల్ రన్ పూర్తయ్యేలోపు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు అందరూ ప్రాఫిట్స్ అందుకోనున్నారు. చిక్కంతా బయట నుండే వస్తోంది. కర్ణాటక, యూఎస్ లో ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పేలా లేవు. తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియాలో ఓన్ రిలీజ్ కాబట్టి కలెక్షన్స్ ఎంతొచ్చినా లాభనష్టాల మాటే లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All