Homeటాప్ స్టోరీస్రక్తసిక్తమైన తూత్తుకుడి :11 మంది మృతి

రక్తసిక్తమైన తూత్తుకుడి :11 మంది మృతి

 Sterlite protest turned deadly in thoothukudi : 11 dead sతమిళనాడు లోని తూత్తు కుడి రక్తసిక్తమైంది , ఆందోళన కారులు రెచ్చిపోవడంతో సహనం కోల్పోయిన పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఘోరం జరిగింది ఏకంగా 11 మంది చనిపోగా మరో 60 మంది తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక ఆ 60 మందిలో మరో 15 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది . మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించి తూత్తు కుడి ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది .

తమిళనాడు లోని తూత్తుకుడి లో స్టెరిలైట్ కాపర్ యూనిట్ ని మరింతగా విస్తరించాలని భావించింది అందులో భాగంగా చర్యలు చేపట్టడంతో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు . వంద రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ వేదాంత కంపెనీ మాత్రం తమకు ఏమి పట్టనట్లు స్టెరిలైట్ కాపర్ యూనిట్ ని విస్తృత పరిచే పనిలో ఉండటంతో సహనం కోల్పోయిన ఆందోళన కారులు భీభత్సం సృష్టించారు దాంతో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు . పోలీసుల కాల్పుల్లో మొత్తం 11 మంది చనిపోగా అందులో ఇద్దరు మహిళలు ,ఒక బాలిక ఉండటంతో మరింత ఉద్రక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది . 11 మంది చనిపోగా మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది . పెద్ద ఎత్తున మృతులు ఉండటంతో వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని న్యాయ విచారణకు ఆదేశించాడు .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All