Homeఎక్స్ క్లూసివ్ముగ్గురు హీరోలూ పోటీ పడుతున్నారు

ముగ్గురు హీరోలూ పోటీ పడుతున్నారు

తమిళనాట అగ్ర హీరోలు తమ చిత్రాలను దీపావళి కి విడుదల చేస్తూ పోటీ పడుతున్నారు . అజిత్ , విజయ్ , సూర్య లు తమిళనాట స్టార్ హీరోలు అన్న విషయం తెలిసిందే . అయితే ఈ ముగ్గురు కూడా తమ చిత్రాలను దీపావళి కి రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారట అంతేకాదు ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు ఆ సమయానికి ఖచ్చితంగా పూర్తయ్యేలా …… విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట . అజిత్ – శివ కాంబినేషన్ లో ఇంతకుముందు మూడు చిత్రాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి దాంతో ఇప్పుడు నాలుగో సినిమాకు శ్రీకారం చుట్టారు . 
 
ఇక మరో స్టార్ హీరో విజయ్ – మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన కత్తి , తుపాకీ చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం ఇప్పుడు మూడోసారి జతకట్టారు . అలాగే సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఆ చిత్రాన్ని కూడా దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నాడు . అంటే ముగ్గురు అగ్ర హీరోల చిత్రాలు దీపావళి కి వస్తుండటంతో తీవ్రమైన పోటీ ఏర్పడనుంది . ఇక ఈ మూడు సకాలంలో రిలీజ్ అవుతాయా ? ఎవరైనా వెనకబడతారా చూడాలి . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All