
బ్యాడ్ టైమ్ నడుస్తుంటే ఏది చేసినా, ఎంత ప్రయత్నించినా ఏదీ కలిసి రాదు. ఇదే పరిస్థితిని ఓ స్టార్ ప్రొడ్యూసర్ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్నాడు. స్టార్ హీరోలతో పరిచయాలు..క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు తీయగల సత్తా వున్నా కాలం కలిసిరాకపోవడంతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కార్పొరేట్ రంగం నుంచి సినిమాల్లోకి ఎంటరైన ఆయన ఇప్పుడు తాజా పరిస్థితుల నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయనే పీవీపీ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి.
విక్రమ్ నటించిన `వీడింతే` సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించిన పీవీపీ తొలి సినిమా నుంచే వరుస పరాజయాల్ని సొంతం చేసుకుని భారీగా నష్టపోయారు. కమల్ నటించిన `విశ్వరూపం`, సైజ్ జీరో, ఇరండ ఉలగం, ఊపిరి, క్షణం, ఎవరు వంటి చిత్రాల్నినిర్మించారు. మహేష్ నటించిన `మహర్షి` చిత్రానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా కారణంగా మహేష్‌తో, `ఊపిరి` కారణంగా శృతిహాసన్‌తో వివాదాలు ఎదుర్కోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఆ తరువాత ఎన్టీఆర్ నటించిన `టెంపర్` చిత్రానికి నిర్మాత బండ్ల గణేష్‌కు ఫైనాన్స్ చేశారు. అయితే ఆ డబ్బులు బండ్ల గణేష్ తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. ఈ వివాదం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. వైసీపీ తరుపున విజయవాడ ఎంపీగా పోటీకి దిగిన పీవీపీ దారుణంగా ఓటమి చెందడంతో ఆయనని ఇండస్ట్రీ దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఎలాగైనా స్టార్ హీరోతో సినిమా చేసి మళ్లీ వార్తల్లో నిలవాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవేవీ ఫలించడం లేదు. ఏ స్టార్ హీరో కూడా పీవీపీతో కలిసి సినిమా చేయడానికి ముందు రావడం లేదట. అయితే తాజాగా ఈ అడ్డంకుల్ని దాటుకుని పీవీపీ ఓ భారీ ప్రాజెక్ట్‌ని ఫైనల్ చేసినట్లు తెలిసింది. దీని వివరాలు త్వరలోనే మీడియాకు విడుదల చేయబోతున్నారట.