Homeటాప్ స్టోరీస్ఏదైనా వ్యాక్సిన్ వచ్చాకే అంటున్నారా?

ఏదైనా వ్యాక్సిన్ వచ్చాకే అంటున్నారా?

ఏదైనా వ్యాక్సిన్ వచ్చాకే అంటున్నారా?
ఏదైనా వ్యాక్సిన్ వచ్చాకే అంటున్నారా?

లాక్ డౌన్ సడలింపులతో స్తంభించిన జనజీవితం మళ్ళీ రోడ్డెక్కింది. అన్నిరంగాల్లో కదలిక మొదలైంది. అయితే సినిమా రంగంలోనే మళ్ళీ  సందడి మొదలవుతుందని అంటా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. టీవీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి.

వీటితో పాటు చిన్న సినిమాల షూటింగ్లు జరుగుతున్నాయి కానీ స్టార్ హీరోల చిత్రాలు మాత్రం ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఎప్పుడు మొదలయ్యేది చెప్పడం లేదు. సినిమా షూటింగ్ లకు అనుమతులు కావాలని వరుస మీటింగ్ లు పెట్టారు తీరా ఇచ్చాక ఒక్క స్టార్ హీరో కూడా షూటింగ్ లకు రావడానికి భయపడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
”ఆర్ ఆర్ ఆర్’ టెస్ట్ షూట్ చేస్తానని చెప్పిన రాజమౌళి ప్రస్తుతం సైలెంట్ కావడానికి కారణం అదే అని తెలిసింది. బిగ్ మూవీస్ ఆగస్టు లో స్టార్ట్ అవుతాయని చెబుతున్నా హీరోలు మాత్రం వ్యాక్సిన్ వచ్చేంత వరకు లొకేషన్లో అడుగు పెట్టమని చెబుతున్నారట. దీంతో బిగ్ స్టార్ల చిత్రాలు వ్యాక్సిన్ వచ్చేంత వరకు సెట్స్ paiki రావని చెబుతున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All