Homeఎక్స్ క్లూసివ్4 రోజుల్లో 4 భారీ సినిమాల రిలీజ్ సాధ్యమేనా ?

4 రోజుల్లో 4 భారీ సినిమాల రిలీజ్ సాధ్యమేనా ?

Star heroes in pongal fightingనాలుగు రోజుల్లో వరుసగా రోజుకొకటి చొప్పున నాలుగు సినిమాల విడుదల తేదీలు ప్రకటించేసుకున్నారు . అయితే అవన్నీ కూడా భారీ సినిమాలు దాంతో ప్రకటించిన సినిమాలన్నీ విడుదల అవుతాయా ? అన్నది పెద్ద ప్రశ్న గా మారింది . 2019 జనవరి 9 న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ”ఎన్టీఆర్ కథానాయకుడు” విడుదల అవుతోంది . ఆ మరుసటి రోజున అంటే జనవరి 10 న రజనీకాంత్ నటించిన ” పెట్టా ” విడుదల అని ప్రకటించారు .

జనవరి 11 న రాంచరణ్ నటించిన ”వినయ విధేయ రామ” చిత్రం విడుదల అవుతోంది , ఆ మరుసటి రోజున అంటే జనవరి 12న వెంకటేష్ – వరుణ్ తేజ్ లు నటించిన ” F 2” విడుదల అని ప్రకటించారు . జనవరి 9 నుండి 12 వరకు రోజుకొక సినిమా విడుదల అంటే తప్పకుండా థియేటర్ ల సమస్య వస్తుంది . ఎందుకంటే నాలుగు కూడా భారీ సినిమాలు కాబట్టి థియేటర్ ల సమస్య వస్తుంది దాంతో ఒక సినిమా తప్పకుండా వాయిదా వేసుకోవాల్సిందే . మరి ఎవరు వాయిదా వేసుకుంటారు అన్నది చూడాలి . ఎన్టీఆర్ బయోపిక్ , వినయ విధేయ రామ తప్పకుండా రిలీజ్ లో మార్పు లేదు , ఇక మిగిలిన రెండు చిత్రాల్లోనే ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి .

- Advertisement -

English Title: Star heroes in pongal fighting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All