Homeటాప్ స్టోరీస్14 కోట్ల భారీ విరాళం ఇచ్చిన స్టార్ హీరో

14 కోట్ల భారీ విరాళం ఇచ్చిన స్టార్ హీరో

Star hero Vijay announces 14 crores for kerala flood relief fundకేరళలో వరదలతో ప్రజలంతా విలవిలలాడుతున్నారు , దాంతో కేరళ ప్రజలను ఆదుకోవడానికి భారీ ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ప్రముఖులు . ఇక హీరోలు , హీరోయిన్ లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు సహాయం అందిస్తున్నారు . ఇప్పటికే పలువురు విరాళాలు అందించగా తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కళ్ళు చెదిరేలా 14 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించాడు . అందరూ లక్షల్లో డబ్బులు ఇస్తుంటే ఈ స్టార్ హీరో మాత్రం భారీ విరాళాన్ని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది . ఇక ఈ భారీ విరాళం విజయ్ పెద్ద మనసు ని చాటి చెబుతోంది .

తమిళనాట రజనీకాంత్ తర్వాత విజయ్ కి అంతటి స్టార్ డం ఉన్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ హీరో నటించిన సర్కార్ విడుదలకు సిద్ధం అవుతోంది . ఇక విజయ్ మాత్రమే కాకుండా తెలుగు హీరోలు సైతం చాలామంది విరాళాలు ప్రకటించారు . ఎవరికి తోచిన సహాయం చేస్తున్నారు . భారీ విపత్తుతో కేరళ అతలాకుతలం అయ్యింది , ఇప్పటికి కూడా భారీ వర్షాలు కేరళ ని ముంచెత్తుతున్నాయి దాంతో భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు .

- Advertisement -

English Title: star hero vijay announces 14 crores for kerala flood relief fund

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All