
కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి , నిర్మాత దానయ్య కలవబోతున్నారు. ఈ నెల 25 న రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఈ మూవీ దాదాపు 18 భాషల్లో వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు.
ఈ క్రమంలో ఏపీ లో ఈ సినిమా కు అదనపు షోస్ తో పాటు బినెఫిట్ షోస్ కు అనుమతి ఇవ్వాలని రాజమౌళి తో పాటు దానయ్య జగన్ ను కోరబోతున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో మరికాసేపట్లో జగన్ ను కలవబోతున్నారు. రీసెంట్ గా ఏపీలో కొత్త జీవో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకటన సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగాయి. మరి ఇప్పుడు రాజమౌళి భేటీ అనంతరం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.