Homeటాప్ స్టోరీస్వైభవంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం

వైభవంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం

వైభవంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం
వైభవంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం

ధ్వజరోహణానికి ముందు చేపట్టే అంకురార్పణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమైన అంకురార్పణ కార్యక్రమాన్ని భక్తులు కన్నులారా తిలకించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంక‌టేశ్వర‌స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజరోహణానికి ముందు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. విష్వక్సేనుని పర్యవేక్షణలో గంటసేపు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

దీన్నే మృత్సంగ్రహణ యాత్ర లేదా పుట్టమన్ను సేకరణగా పిలుస్తారు. ఈ మట్టిలో నవ ధ్యాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్నే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం తర్వాత తొమ్మిది రోజుల పాటు శ్రీవారు ఉదయం, రాత్రి వివిధ వాహన సేవలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు శ్రీవారు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు అంటే సెప్టెంబర్‌ 28 ఉదయం చిన్న శేషవాహనంపై విహారిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకూ స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహన సేవలు నిర్వహిస్తారు. ఇక సెప్టెంబర్‌ 29 ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు దర్శనం ఇస్తారు. సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు.

- Advertisement -

అక్టోబర్1వ తేదీ ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, అక్టోబర్2వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహన సేవలు నిర్వహిస్తారు. అక్టోబర్‌3 ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 4వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అక్టోబర్‌5వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. అక్టోబర్‌5వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజాఅవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కరోనా కార‌ణంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా రెండు సంవత్సరాలు నిర్వహించింది టీటీడీ.

ఈ ఏడాది అత్యంత వైభవంగా వాహనసేవలను నిర్వహించాలని టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ యేడాది ఒకే బ్రహ్మోత్సవం కావడం, రెండు సంవత్సరాల తర్వాత మాడ వీధుల్లో వాహన సేవలను ఊరేగించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేసిన టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం వంటి ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All