Homeటాప్ స్టోరీస్మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

srireddy fire on saroj khan బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసి మళ్ళీ సోషల్ మీడియా లో దుమ్ము లేపుతోంది శ్రీరెడ్డి . సినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ పట్ల శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా ఈ విషయం బాలీవుడ్ కి సైతం పాకింది దాంతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఈ వ్యాఖ్యలపై స్పందించింది . కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉందని అయినా సినిమారంగంలో అమ్మాయిలను వాడుకున్నప్పటికీ సినిమాల్లో అవకాశాలు తప్పకుండా ఇస్తున్నారని అందులో పెద్దగా తప్పేమి లేదని కామెంట్ చేయడం సంచలనానికి దారి తీసింది .

ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్లు అలాగే శ్రీరెడ్డి కూడా . మీరంటే ఇంతకుముందు ఎంతో గౌరవం ఉండేది కానీ మీ మాటలు విన్న తర్వాత ఆ గౌరవం పోయిందని …… అయినా దర్శక నిర్మాతలకు తలొగ్గి ఉండటానికి మాకు ఆత్మాభిమానం లేదా ? అంటూ మండిపడుతున్నారు . ఛాన్స్ ఇస్తున్నారు కదా అని అందరి పక్కలో పడుకోలేము కదా ! అని ఫైర్ అవుతున్నారు పలువురు సినిమా రంగంలోని మహిళలు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts